365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 25,2023: వాతావరణ విశ్లేషణ Meteorological Analysis ఈ రోజు ఉదయం 08:30 ఆధారంగా) : సోమవారం అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాల్లోని, పశ్చిమ మధ్య, పరిసరాల్లోని వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి మి ఎత్తు వరకు కొనసాగుతుంది.

ఈ తీవ్ర అల్పపీడనం సుమారుగా రాగల 24 గంటలలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది . ఈ వాయుగుండం నెమ్మదిగా వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలను చేరుకునే అవకాశం ఉంది.

రుతుపవన ద్రోణి ఈ రోజు జైసల్మేర్, కోట, గుణ, రాయ్‌పూర్, భవానీపట్న, పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. అక్కడి నుంచి తూర్పు-ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.

ఈ రోజు షీయర్ జోన్ 17°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు పేర్కొన్నారు.

వాతావరణ హెచ్చరికలు
(weather warnings)

రాగల మూడు రోజులు భారీ వర్షములు కొన్ని చోట్ల, భారీ నుండి అతిభారీ వర్షములుతో పాటు అత్యంత భారీ వర్షములు తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

3 రోజులు రెడ్ అలెర్ట్..
రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.