365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, మార్చి 5, 2023:నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు ఆసక్తి ,అర్హత ఉన్న అభ్యర్థులు NIELIT అధికారిక సైట్ nielit.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టుల నమోదు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 4తేదీ వరకు ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లోభాగంగా 598 పోస్టులను భర్తీ చేయనున్నారు.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేక పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను కోరింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
సైంటిస్ట్ B గ్రూప్ A: 71 పోస్ట్‌లు
సైంటిఫిక్ ఆఫీసర్/ఇంజినీర్: 196 పోస్టులు
సైంటిఫిక్,టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 30 నుంచి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. వేర్వేరు పోస్టులకు వయోపరిమితి భిన్నంగా ఉంటుంది. దీనితో పాటు, ఈ పోస్టులలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,400 నుంచి 1,77,500 వరకు జీతం ఇవ్వనున్నారు.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 800 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దీనితో పాటు, ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష ,ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.