365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్12, హైదరాబాద్: నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎన్‌ఐఎంఎఫ్)కు చెందిన ఎస్సెట్ మేనేజర్ నిప్పాన్ లైఫ్ ఇండియా ఎస్సెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (నామ్ ఇండియా) (గతంలో రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఎస్సెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌గా ఉన్నది) ఇప్పుడు నిప్పాన్ ఇండియా పాసివ్ ఫ్లెక్సీక్యాప్ ఎఫ్‌ఓఎఫ్ ను విడుదల చేసినట్లు వెల్లడించింది.నిప్పాన్ ఇండియా పాసివ్ ఫ్లెక్సీక్యాప్ ఫాఫ్, గణనీయంగా నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఈటీఎఫ్‌లు,ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్‌ను నిఫ్టీ 500 టీఆర్‌ఐతో బెంచ్‌మార్క్ చేశారు. ఈ ఎన్‌ఎఫ్‌ఓను 10 డిసెంబర్ తేదీన తెరిచారు, 24 డిసెంబర్ 2020వ తేదీన మూసివేస్తారు. కనీస పెట్టుబడిగా 5వేల రూపాయలు ఆ పైన ఒక రూపాయి మల్టిప్లికేషన్ తో ఎంతైనా పెట్టవచ్చు.లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్… ఇలా మార్కెట్‌లోని విభిన్న విభాగాలు పలు దశలలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తాయి. ఏ మార్కెట్ ఎప్పుడు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందనేది ఊహించడం కష్టం. అందువల్ల విభిన్న మార్కెట్‌ల వద్ద పెట్టుబడులు పెట్టడమనేది దీర్ఘకాలంలో భారీ రిటర్న్స్‌ను సృష్టిస్తాయి.
నిప్పాన్ ఇండియా పాసివ్ ఫ్లెక్సిక్యాప్ ఫాఫ్ విభిన్న మార్కెట్ క్యాప్‌లలో పెట్టుబడులు పెడుతుంది. తద్వారా మార్కెట్‌జ్ఞానంతో పాటుగా పరిశ్రమ జ్ఞానం సైతం ఒడిసిపట్టుకుని మార్కెట్ క్యాప్ కేటాయింపుల పరంగా వ్యక్తిగత ఫండ్ మేనేజర్ల వివక్షతను తొలగిస్తుంది.ఈ స్కీమ్ పెట్టుబడి లక్ష్యం దీర్ఘకాలంలో మూలధన వృద్ధి. దీనికోసం నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్‌లు,ఇండెక్స్ ఫండ్స్ యూనిట్లలో పెట్టుబడులు పెడుతుంది.‘‘ఈ వినూత్న ఆఫర్ ను పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఓ సంస్థగా మా మదుపరుల కోసం వైవిధ్యమైన పెట్టుబడి వ్యూహం అందించడానికి కట్టుబడి ఉన్నాము’’ అని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కో–చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సౌగత ఛటర్జీ అన్నారు.