365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 30,2021:సిటిజన్ చార్టర్ విధానాన్ని అన్నిరాష్ట్రాలు అనుసరించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ సిద్ధమైంది. అందులోభాగంగా రేపటి నుంచి నుంచి ఆగస్టు 15 వరకూస్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 15 కల్లా ప్రతి పంచాయతీలో సిటిజన్ చార్టర్ తయారుచేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్దేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీ అధికారులకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)ఆన్‌లైన్‌లో ఓరియంటేషన్ కార్యక్రమాన్నినిర్వహించింది.
జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే ఓరియెంటేషన్ కార్యక్రమానికి ఆయా రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌డీ రూపొందించిన ఫెసిలిటేటర్స్ ట్రైనింగ్ మాడ్యూల్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యదర్శి ఆలోక్ ప్రేమ్‌నగర్, ఎన్‌ఐఆర్‌డీ డిప్యూటీ డైరెక్టర్ జనరల రాధిక రస్తోగి, ఎన్‌ఐఆర్‌డీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కతిరిసేన్ తదితరులు పాల్గొన్నారు.