365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 3,2025: ఇన్వెస్టర్లలో అవగాహన పెంపొందించి, చెల్లించబడని డివిడెండ్లు,క్లెయిమ్ చేయని షేర్లను తిరిగి పొందడంలో వారికి తోడ్పాటు అందించేందుకు సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎస్ఎల్ ఐపీఎఫ్),బీఎస్ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (బీఎస్ఈ ఐపీఎఫ్), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ)తో కలిసి ఆగస్టు 30, 2025న హైదరాబాద్‌లో ‘నివేశక్ శివిర్’ను నిర్వహించాయి.

ఈ శిబిరం ప్రధానంగా అన్‌క్లెయిమ్డ్ ఇన్వెస్టర్ అసెట్స్ పరిమాణాన్ని తగ్గించడం, పెట్టుబడిదారుల హక్కులను రక్షించడం,క్లెయిమ్ ప్రక్రియపై స్పష్టమైన మార్గదర్శకత్వం ఇవ్వడం లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది.

కార్యక్రమం ముఖ్యాంశాలు:

  • ఆరు సంవత్సరాలుగా క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను తిరిగి పొందడంపై మార్గదర్శకత్వం.
  • వెంటనే KYC,నామినేషన్ అప్‌డేట్లు చేసుకునే సౌకర్యం.
  • క్లెయిమ్ ప్రక్రియకు సంబంధించిన సందేహాల పరిష్కారం.
  • ఐఈపీఎఫ్ఏకి సమర్పించిన పెండింగ్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో సహాయం.

కార్యక్రమంలో ప్రత్యేకంగా 23 సర్వీస్ డెస్కులు ఏర్పాటు చేయబడ్డాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎన్ఎస్‌డీఎల్ వంటి మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థలతో పాటు, కేఫిన్ టెక్నాలజీస్, బిగ్‌షేర్ సర్వీసెస్, పూర్వా షేరిజిస్ట్రీ, MUFG ఇన్ఫోలైన్ సంస్థలు సహకరించాయి.

ఈ కార్యక్రమానికి 360 మందికి పైగా ఇన్వెస్టర్లు, క్లెయిమెంట్లు హాజరయ్యారు. వీరిలో విద్యార్థులు, రిటైల్ ఇన్వెస్టర్లు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్లు ఉన్నారు.

ఈ శిబిరంలో ఐఈపీఎఫ్ఏ సీఈవో శ్రీమతి అనిత షా ఆకెళ్ల, సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ జీవన్ సోన్‌పరోటే, శ్రీ సునీల్ జయవంత్ కదమ్, ఐఈపీఎఫ్ఏ జనరల్ మేనేజర్ Lt. Col. ఆదిత్య సిన్హా, సెబీ జీఎం శ్రీ బినోద్ శర్మ, సీడీఎస్ఎల్ ఐపీఎఫ్ హెడ్ శ్రీ సుధీష్ పిళ్లై, బీఎస్ఈ ఐపీఎఫ్ శ్రీ కిరణ్ పాటిల్ ,ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Read This also…iPHEX 2025: India Strengthens Global Healthcare Leadership with Regulatory Conclaves..

సీడీఎస్ఎల్ రూపొందించిన ఇన్వెస్టర్ గైడ్ను సెబీ, ఐఈపీఎఫ్ఏ,ఇతర సంస్థలు సంయుక్తంగా ఆవిష్కరించాయి. ఇది క్లెయిమ్ ప్రక్రియలో ఇన్వెస్టర్లకు దోహదపడనుంది.

రోజంతా సాగిన ఈ అవగాహన కార్యక్రమం, అన్‌క్లెయిమ్డ్ అసెట్స్ సమస్యను తగ్గించడం, క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయడం,ఇన్వెస్టర్లను ఆత్మనిర్భర్‌గా చేయడం అనే ప్రధాన లక్ష్యాలకు కేంద్రీకృతమైంది.