
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్రవరి 2,2022: టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో నిరుపయోగంగా ఉన్న ఇంజినీరింగ్ సామగ్రి ఎలాంటి దుర్వినియోగం కాలేదని, ఈ విషయమై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని టిటిడి తెలియజేస్తోంది.
తిరుమలలో పరిశుభ్రత చర్యల్లో భాగంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ దగ్గర పోగుపడిన ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు, కప్ బోర్డులు, ఇనుప తీగలు, బిట్‌లను(వ్యర్థాలు) ఘనవ్యర్థాల ప్లాంట్‌కు తరలించడం జరిగింది. ఏరియేషన్ ట్యాంక్‌పై ఏర్పాటు చేసిన షెల్టర్ చాలా పాతది. షెల్టర్‌పై ఉన్న పాత పైకప్పు షీట్లు దెబ్బతిని ఇబ్బందికరంగా మారడంతో షెల్టర్‌ను కొత్త షీట్‌లతో పునరుద్ధరించి దెబ్బతిన్న షీట్‌లను ఔటర్ రింగ్ రోడ్డులోని పాచికాలువ సమీపంలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ వద్దకు తరలించడం జరిగింది. అనంతరం ఆ షీట్లను సామగ్రి నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్‌కు ఉపయోగించడం జరిగింది.
