365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2024: తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి నాణ్యతలో లోపముందని టీటీడీ ఈఓ శ్యామలరావు స్పష్టం చేశారు. “నాణ్యమైన నెయ్యిని అతి తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే లభిస్తోంది. తక్కువ ధర కారణంగా నాణ్యతపై సరైన కంట్రోల్ ఉండడం లేదు” అని ఆయన వివరించారు.
అటు పోటు సిబ్బంది కూడా నెయ్యి నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. “రూ.75 లక్షలతో ల్యాబ్ నిర్మాణం జరగాల్సి ఉండేది, కానీ గత ప్రభుత్వ అధికారులు ఆ పనిని అనుసరించలేదు” అని ఆయన అన్నారు. ఈ ప్రకటనతో, తిరుమల లడ్డూలో నాణ్యమైన పదార్థాల ఉత్పత్తి పై అనేక ప్రశ్నలు వస్తున్నాయి.
మరోపక్క టీటీడీ ఈవోకు చంద్రబాబు ఆదేశం..
టీటీడీలో నెయ్యి వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సంఘటనపై తక్షణమే సాయంత్రంలోగా నివేదిక అందించాలని టీటీడీ ఈవోకు ఆదేశించారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలతో, తిరుమల ఆలయానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.