365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 30,2024: నథింగ్ ఇండియా కోసం లండన్ కి చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్ నథింగ్ ప్రెసిడెంట్ గా విశాల్ భోలా నియామకాన్ని ప్రకటించింది.
అంతర్జాతీయ వ్యాపార నాయకత్వంలో 28 సంవత్సరాల విస్తృతమైన కెరీర్ తో, విశాల్ భోలా యూనివర్శల్, వరల్ పూల్ సహా ప్రముఖ మల్టీనేషనల్ కార్పోరేషన్స్ నుంచి విస్తృతమైన అనుభవం తెచ్చారు.
నథింగ్ లో తన కొత్త పాత్రలో విశాల్ భోలా భారతదేశంలో నథింగ్ వృద్ధి మార్గాన్ని పెంచడంలోకీలకమైన బాధ్యతవహిస్తారు, వినియోగదారు టెక్, వ్యూహాత్మక వ్యాపార నిర్వహణలో తన విస్తృతమైన నైపుణఅయాన్ని సమన్వయం చేస్తారు.
అతని నియామకం తమ ఉనికిని విస్తరించడంలో ,భారతదేశపు మార్కెట్ లో ఆఫరింగ్స్ విస్తరణకు నథింగ్ నిబద్ధతను సూచిస్తోంది.
నథింగ్ లో కార్ల్ పీ, సీఈఓ, సహ-స్థాపకులు ఇలా వ్యాఖ్యానించారు, “అంతర్జాతీయ వినియోగదారు సరుకుల పరిశ్రమలో విశాల్ విస్తృతమైన అనుభవం నాయకత్వం మా టీమ్ కు విలువైన చేరికగా అతనిని చేసింది. అతన్ని విదేశాలకు ఆహ్వానించడానికి ఉత్సాహంగా ఉన్నాము.
టెక్ దృశ్యాన్ని మేము వినూత్నంగా తయారు చేసి పునర్నిర్వచించడాన్ని కొనసాగిస్తున్నందున ఆయన తోడ్పాటు కోసం ఎదురుచూస్తున్నాం.”
నథింగ్ లో చేరడానికి విశాల్ భోలా తన ఉత్సాహం గురించి తెలియచేసారు. ఆయన ఇలా అన్నారు, “నేను నథింగ్ ప్రయాణంలో భాగంగా ఉండటానికి ఉల్లాసోత్సాహాన్ని కలిగి ఉన్నాను. కంపెనీ దిగ్గజ ఉత్పత్తులు, టెక్నాలజీని వినోదంగా మార్చే ప్రేరేపించే కల మళ్లీ నాతో ప్రతిధ్వనిస్తుంది.”
యూనిలీవర్ లో రెండు దశాబ్దాలకు పైగా విశాల్ భోలా ప్రయాణం భాగంగా ఉంది, అతను ఇక్కడ భారతదేశం నుండి ప్రారంభించి ఆగ్నేయ ఆసియా, యుఎస్ఏ, ఆఫ్రికా, చైనా లండన్ లో అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం వరకు విస్తరించి వివిధ కీలకమైన స్థానాలు నిర్వహించారు.
యూనీలీవర్ లో అతని వ్యవధి ముగిసిన తరువాత, విశాల్ భోలా వరల్ పూల్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా చేరారు. వరల్ పూల్ కార్పొరేషన్ కోసం భారతదేశపు ఉప ఖండంలో లాభాలు వృద్ధిని ప్రోత్సహించడానికి బాధ్యతవహిస్తున్నారు.