365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గురుగ్రామ్, 29 నవంబర్ ,2025: లండన్‌కు చెందిన ప్రముఖ టెక్ బ్రాండ్ నథింగ్ (Nothing), భారత మార్కెట్‌లో తన సరికొత్త ‘ఫోన్ (3a) లైట్’ను అధికారికంగా ఆవిష్కరించింది. సొగసైన బ్లూ కలర్‌తో పాటు క్లాసిక్ బ్లాక్, వైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మారీ ప్రత్యేక ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో యువతను ఆకర్షిస్తోంది.

8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర ₹20,999 కాగా, బ్యాంక్ ఆఫర్ల తర్వాత కేవలం ₹19,999కే లభిస్తోంది. ఈ ఫోన్ డిసెంబర్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా తదితర ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

ప్రధాన ఫీచర్స్ ..

6.77 అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే (120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్)
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్
50MP ప్రధాన కెమెరా (ట్రూలెన్స్ ఇంజిన్ 4.0, 4K@30fps వీడియో)
16MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ + 33W ఫాస్ట్ ఛార్జింగ్
గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ (నోటిఫికేషన్ లైట్స్, కెమెరా కౌంట్‌డౌన్)
IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
అల్యూమినియం ఇంటర్నల్ ఫ్రేమ్, తేలికైన డిజైన్
Android 15 ఆధారిత Nothing OS 3.5
3 ఏళ్ల OS అప్‌డేట్స్ + 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు

ఈ ధరలో ఇంత పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఫోన్ (3a) లైట్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీని సృష్టించనుందని అంచనా వేస్తున్నారు.