Sat. Oct 19th, 2024
Bank-of-India-365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, ఫిబ్రవరి13, 2023: బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2023: బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీవోఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2023: బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ పోస్ట్‌ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని కింద బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగనుంది.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, bankofindia.co.in ని సందర్శించడం ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25 వరకు ఉంది.

పోస్టుల వివరాలు…

Bank-of-India-365

బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లో 350 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, స్పెషలిస్ట్ స్ట్రీమ్‌లో 150 ఐటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ డ్రైవ్ ప్రారంభించారు.

అర్హతలు..

క్రెడిట్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఐటి ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో డిగ్రీ ఉండాలి.

విద్యార్హత గురించి మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చదివి తదనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి.

వయస్సు పరిధి..

బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దీనితో పాటు ఆన్‌లైన్ టెస్ట్, జిడి అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Bank-of-India-365

దరఖాస్తు రుసుము..

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.850గా నిర్ణయించారు. SC,ST,PWD అభ్యర్థులకు ఫీజు రూ. 175గా ఉంది.

error: Content is protected !!