365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబర్21,2022: ఎన్టీ ఆర్ కృష్ణా జిల్లా లో దారుణం జరిగింది. వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన జి.
భార్గవి (20), నందిగామ ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు కళాశాలకు ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తోంది.
ఈ క్రమంలోనే బుధవారం కాలేజ్ నుంచి తిరిగి వస్తుండగా దాహం వేసి బస్సులో ఉన్న తోటి ప్రయాణికుల నుంచి మంచినీరు అడిగి సేవించింది.
ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపులో విపరీతమైన నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయింది.

స్థానికులు ఆమెను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి బిడ్డ మృతదేహాన్ని చూసి బోర్లు విలపించ సాగారు.
బస్సులో సేవించిన తాగునీరు వల్లే ఆమె మృతి చెంది ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.