Numaish EXPO 2026 : జనవరి 1న ప్రారంభం కానున్న నుమాయిష్ 2026 ఎక్స్ పో

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 28,2025: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రతి ఏటా కొలువుతీరే నుమాయిష్ ఎక్స్ పో టైమ్ రానే వచ్చింది. 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పేరుతో పిలిచే నుమాయిష్ 2026ను మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. నుమాయిష్ 2026 ఎక్స్ పో జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది.

దీ చదవండి : 2026 మొత్తం ‘దండోరా’ గురించే చర్చించుకుంటారు: సక్సెస్ మీట్‌లో నటుడు శివాజీ ధీమా..

Read this also:“Dhandoraa” Success Meet: Sivaji Hails it as a Masterpiece; Comparisons to Mari Selvaraj Arise.

Read this also: Bondada Engineering Secures Rs.392 Crore Solar EPC Contract from NTPC Green Energy..

ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు, శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుంది ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ 2026. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి.

ఎంట్రీ ఫీజు రూ. 50 నిర్ణయించగా, ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది నుమాయిష్‌లో మొత్తం 1,050 స్టాళ్లకు అనుమతించగా ఇది పరిశ్రమ, సరికొత్త ఆవిష్కరణలకు ప్రధాన వేదికగా ఈ ప్రదర్శనగా నిలవనుంది.