365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, నవంబర్ 11, 2021 : న్యూట్రిఫీ టుడే తాము తమ న్యూట్రిఫీ టుడే అకాడమీ (https://academy.nutrifytoday.com/) ప్రారంభించినట్లు వెల్లడించింది. ప్రపంచంలో మొట్టమొదటి న్యూట్రాస్యూటికల్స్ అకాడమీ ఇది. పరిశ్రమ వృద్ధితో పాటుగా తాము కూడా ఉండేలా న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఇది ఉంటుంది. ముంబై, బెంగళూరులలో న్యూట్రిఫీ టుడే అకాడమీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తొలుత ఇండియా,ఆసియా దేశాలపై దృష్టి సారించి, అనంతరం ఇతర దేశాలకు ఆన్‌లైన్ కరిక్యులమ్ ద్వారా విస్తరించనుంది.
గీతం, సెంచురియన్ యూనివర్శిటీ, ఏఐసీ–సీసీఎంబీ, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసన్ వంటి పలు యూనివర్శిటీలు న్యూట్రిఫీ టుడే అకాడమీతో ఒప్పందాలు కలిగి ఉన్నాయి. న్యూట్రిఫీ టుడే చీఫ్ క్యాటలిస్ట్ అమిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘న్యూట్రాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ ఫార్ములేషన్‌లో కెరీర్ కోరుకుంటున్న, ఫార్మా, ఫుడ్ టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్ వంటివి అభ్యసిస్తున్న యూనివర్శిటీ విద్యార్థులకు తగిన అవకాశాలను న్యూట్రిఫీ టుడే అకాడమీ అందిస్తుంది. 2024 నాటికి 5వేల మంది ప్రొఫెషనల్స్‌కు శిక్షణ అందించగలమని ఇది అంచనా వేస్తుంది’’ అని అన్నారు.
ఈ అకాడమీ ప్రారంభం గురించి శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం భారత్ 8 మిలియన్‌డాలర్ల మార్కెట్‌గా ఉంది. అయితే ఇక్కడ నుంచి ఎగుమతులు గణనీయంగా జరుగనున్నాయని మేము అంచనా వేస్తున్నాం. ఈ రంగంలోని వాటాదారుల అంచనా ప్రకారం 2025 నాటికి ఈ పరిశ్రమ 40బిలియన్‌డాలర్ల ను మరియు 2030 నాటికి 100 బిలియన్‌డాలర్ల విలువ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు’’ అని అన్నారు. డాక్టర్ బాల్‌కుమార్ మరాఠీ, పూర్వ ఆర్ అండ్ డీ హెడ్ ఆఫ్ యునిలీవర్,బ్రిజెష్ కపిల్, పూర్వ ప్రొక్టర్ అండ్ గాంబెల్ ఇండియా బోర్డ్ మెంబర్,నాజ్నిన్ హుస్సెన్, పూర్వ అధ్యక్షుడు– ఇండియన్ డైటిటిక్స్ అసోసియేషన్ , కీలక ఓపినియన్ లీడర్– షెల్డన్ బేకర్ , బేకర్ డిల్లాన్ గ్రూప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లు న్యూట్రిఫీ టుడే అకాడమీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు.