365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 20,2023:భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో నష్టపోయాయి. చాలా అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల, నిరాశాజనకమైన కార్పొరేట్ కంపెనీ ఫలితాలు, అమెరికా బాండు యీల్డులు పెరగడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉండటం ఇందులో కొన్ని.
ఉదయం భారీ నష్టాల్లో మొదలైన సూచీలు కోలుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిఫ్టీ 46, సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 83.24 వద్ద స్థిరపడింది.

ఎఫ్‌ఐఐలు నేడు రూ.1093 విలువైన షేర్లను తెగనమ్మారు. రూ.736 కోట్లతో డీఐఐలు నెట్ బయర్స్‌గా ఉన్నారు. ఆసియాలో దాదాపుగా అన్ని మేజర్ సూచీలు పతనమయ్యాయి.
క్రితం సెషన్లో 65,877 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,484 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. వెంటనే 65,343 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. మధ్యాహ్నం పుంజుకొని 65,869 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.
ఐరోపా మార్కెట్లు మొదలవ్వగానే పతనమై ఆఖరికి 247 పాయింట్ల నష్టంతో 65,529 వద్ద ముగిసింది. గురువారం 19,545 వద్ద ఆరంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,681 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది.
19,512 వద్ద కనిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 46 పాయింట్లు పతనమై 19,624 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ సైతం 134 పాయింట్లు నష్టపోయి 43,754 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50 అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 17:33గా ఉంది. బజాజ్ ఆటో (6.55%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (5.97%), హీరోమోటో (3.74%), నెస్లే ఇండియా (3.51%), అల్ట్రాటెక్ సెమ్ (2.86%) టాప్ గెయినర్స్.
విప్రో (3.04%), టెక్ మహీంద్రా (1.52%), సన్ ఫార్మా (1.46%), ఎన్టీపీసీ (1.24%), యూపీఎల్ (1.22%) టాప్ లాసర్స్. నేడు ఆటో, కన్జూమర్ రంగాల సూచీలు పెరిగాయి.
బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు తీవ్రంగా నష్టపోయాయి.
అక్టోబర్ నెల నిఫ్టీ ఫ్యూచర్స్ టెక్నికల్ ఛార్ట్‌ను గమనిస్తే 19,530 వద్ద సపోర్టు, 19,650 వద్ద రెసిస్టెన్సీ ఉన్నాయి. ఇన్వెస్టర్లు నియర్ టర్మ్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటో, సిప్లా, బజాజ్ ఆటో షేర్లను కొనుగోలు చేయొచ్చు.

నేడు నిఫ్టీ 50 పతనంలో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్ కీలక పాత్ర పోషించాయి. బజాజ్ ఆటో, నెస్లే రికవరీకి ఉపయోగపడ్డాయి.
రాబోయే రోజుల్లో సూచీలకు ఫండమెంటల్, టెక్నికల కోణాల్లో అనేక అవాంతరాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బయోకాన్ కేదార్ ఉపాధ్యాయ్‌ను కొత్త సీఎఫ్‌వోగా నియమించింది.
ఎన్‌క్యూర్ థెరపాటిక్స్‌లో కొటక్ మహీంద్రా బ్యాంకు విభాగం 6.12 శాతం వాటాను కైవసం చేసుకుంది. వార్షిక ప్రాతిపదికన రామకృష్ణ ఫోర్జింగ్స్ ఆదాయం 19.04 శాతం పెరిగి రూ.981 కోట్లుగా నమోదైంది.
లాభాలు తగ్గడంతో మాస్టెక్ షేర్లు 8 శాతం పడిపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆదాయం 15.25 శాతం పెరిగి రూ.16,012 కోట్లుగా ఉంది.
కిరి ఇండస్ట్రీస్‌లో 11.4 లక్షలు, డీసీడబ్ల్యూలో 49.7 లక్షల షేర్లు చేతులు మారాయి. సౌతిండియన్ బ్యాంకు నికర లాభం వార్షిక ప్రాతిపదికన 23 శాతం ఎగిసి రూ.274 కోట్లకు చేరుకుంది.

- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709