365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం, మార్చి 30,2023: ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లా అధికార్లు ఎర్రుపాలెం మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇళ్ల స్థలాలను పరిశీలించారు. మండల పరిధిలోని రేమిడిచర్ల, పెగళ్ళపాడు,ఎర్రుపాలెం, మామునూరు, జమలాపురం గ్రామాలలో ఆర్డీవో రవీంద్రనాథ్ తో కలిసి అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా పరిశీలించారు.
మామునూరు గ్రామంలోని పత్తిపాటి అన్నపూర్ణకు చెందిన భూవివాదాన్ని జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం ఎరుపాలెం మండల కేంద్రంలో 412,13,14 సర్వే నెంబర్ల లో ఉన్న భూమిని పరిశీలించి కలెక్టర్ వారికి నివేదికను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ తిరుమల చారి, గిరిదావర్ అశోక్, సర్వేర్ శేషు లు ఉన్నారు.