365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 27,2025 : ఫ్యాషన్ అంటే నిన్నటిది మొన్నటికి పాతబడటం.. కానీ భారతీయ వనిత అలంకరణలో ‘పాత’ అన్నదే లేదు. నేటి ఆధునిక డిజైనర్లు సైతం వేల ఏళ్ల క్రితం నాటి శిల్పాలను చూసి స్ఫూర్తి పొందుతున్నారంటే అప్పట్లో ఫ్యాషన్ ఎంత ఉన్నతంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
సింధు నాగరికత పొద్దుపొడుపు నుంచి గుప్త యుగపు స్వర్ణమయం వరకు..
భారతీయ నారీ సౌందర్య ప్రస్థానంలో దాగి ఉన్న ఆసక్తికర రహస్యాలు మీకోసం..
అప్పట్లోనే కుట్టు లేని కళాఖండాలు.. అంతరీయ, ఉత్తరీయ!ప్రాచీన భారతీయులు కుట్టు యంత్రాలు లేని కాలంలోనే వస్త్రాన్ని ఒక అద్భుతమైన కళగా మార్చారు. అప్పట్లో దుస్తులు కేవలం శరీరాన్ని కప్పేవి మాత్రమే కాదు, ధరించే తీరును బట్టి ఆ వ్యక్తి సామాజిక హోదాను తెలిపేవి.
అంతరీయ..
ఇది నడుము కింద ధరించే ధోవతి వంటి వస్త్రం. దీనిని ‘కచ్ఛా’ పద్ధతిలో అంటే రెండు కాళ్ల మధ్య నుండి వెనక్కి దోపి కట్టుకునేవారు. నేటి ఆధునిక ‘ధోవతి ప్యాంట్స్’కు మూలం ఇదే! ఉత్తరీయ.. పై వస్త్రంగా వాడే దీనిని రకరకాలుగా ధరించేవారు. నృత్యకారిణిలు నడుముకు చుట్టుకుంటే, కులీన వనితలు భుజాలపై నుండి విలాసంగా వదిలేవారు.
స్తనపట్ట.. వక్షస్థలంపై ధరించే బిగుతైన వస్త్రం..
తరువాతి కాలంలో ఇది ‘చోళీ’గా, ఇప్పుడు ‘బ్లౌజ్’గా రూపాంతరం చెందింది. శిల్పాల్లో దాగి ఉన్న స్టైల్ స్టేట్‌మెంట్స్ అజంతా, ఎల్లోరా శిల్పాలను గానీ, కొండవీడు, హంపి వంటి చారిత్రక కట్టడాలలోని బొమ్మలను గానీ గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది.
అప్పటి మహిళలు ఫ్యాషన్ విషయంలో చాలా ‘బోల్డ్’గా ఉండేవారు. సన్నని నూలు వస్త్రాలు (Muslin), పట్టు వస్త్రాలపై జరీ అల్లికలు అప్పట్లోనే అత్యంత ప్రాచుర్యం పొందాయి.

ముఖ్యంగా మగధ, శాతవాహన కాలంలో మహిళలు ధరించే ‘మేఖల’ దీనినే ఒడ్డాణం అని కూడా అంటారు. ఇది ఆడవారి నడుము అందాన్ని రెట్టింపు చేసేది.
ఆభరణాల జాతర: తల నుండి గోటి వరకు! ప్రాచీన మహిళలు ఆభరణ ప్రియులు. బంగారం, వెండితో పాటు ముత్యాలు, పగడాలను విరివిగా వాడేవారు. మౌళిమణి..తలపైన లేదా జడలో ధరించే అలంకారం.
కర్ణిక..చెవులకు ధరించే పెద్ద కుండలాలు.నిష్క..మెడలో ధరించే బంగారు నాణేల హారాలు (నేటి కాసుల పేరు వంటివి).మంజీరాలు: కాళ్లకు ధరించే అందెల సవ్వడి అప్పట్లో గౌరవానికి చిహ్నం.
నేటి ఫ్యాషన్‌తో పోలిక.. ఆ రహస్యాలు మీకు తెలుసా..?
| ప్రాచీన ఫ్యాషన్ | ఆధునిక ట్రెండ్ |
| కుంకుమ, కస్తూరి | ఆర్గానిక్ మేకప్/బిందీ |
| పారాణి (అల్తా) | నెయిల్ పాలిష్/గోరింటాకు |
| కేళీబంధం (కొప్పు) | మెస్సీ బన్ (Messy Bun) |
| శంఖపు గాజులు | స్టేట్మెంట్ బ్యాంగిల్స్ |
ప్రకృతి సిద్ధ సౌందర్యంనేటిలాగా కెమికల్ కాస్మెటిక్స్ లేకపోయినా, అప్పటి మహిళల చర్మం మెరిసిపోవడానికి కారణం ‘ప్రకృతి’. స్నానానికి శనగపిండి, పసుపు, గంధం వాడేవారు. పెదవులకు రంగు కోసం తాంబూలం వేసుకునేవారు. కళ్లలో కాటుక కేవలం అందం కోసమే కాదు, కంటి ఆరోగ్యానికి కూడా వాడేవారు.
ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీనే ఆశ్చర్యపరిచిన శాంతి దేవి అరుదైన పునర్జన్మ ఉదంతం..!
Read this also:Defence Tech Major Tonbo Imaging Files for IPO; SEBI Receives DRHP for Share Sale..
ఇది కూడా చదవండి : 2026 మొత్తం ‘దండోరా’ గురించే చర్చించుకుంటారు: సక్సెస్ మీట్‌లో నటుడు శివాజీ ధీమా..
Read this also:“Dhandoraa” Success Meet: Sivaji Hails it as a Masterpiece; Comparisons to Mari Selvaraj Arise.
Read this also: Bondada Engineering Secures Rs.392 Crore Solar EPC Contract from NTPC Green Energy..
ఎందుకు ట్రెండ్ అవుతోంది..? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘సస్టైనబుల్ ఫ్యాషన్’ (Sustainable Fashion) పట్ల అవగాహన పెరుగుతోంది. రసాయనాలు లేని రంగులు, పర్యావరణానికి హాని చేయని నూలు వస్త్రాలు ప్రాచీన భారత్ స్పెషాలిటీ.
అందుకే ప్రపంచ వేదికలపై భారతీయ సంప్రదాయ కట్టు నేటికీ అగ్రస్థానంలో నిలుస్తోంది. వేల ఏళ్లు గడిచినా, ఎన్ని సంస్కృతులు వచ్చి వెళ్లినా భారతీయ నారి వేషధారణలోని ఆ ‘సౌందర్య రహస్యాలు’ నేటికీ నిత్య నూతనమే. నాడు శిల్పాల్లో వెలిగిన ఆ కళాఖండాలే.. నేడు ర్యాంప్ వాక్‌లపై మెరుస్తున్నాయి.
