365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 31,2024: పొగాకు పిల్లల జీవితాలకు సెగ పెట్టి కుటుంబానికి ఆవేదన మిగులుస్తుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, లయన్ జి.కృష్ణ వేణీ అన్నారు.
హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్, గోశాల దగ్గర మోతీలాల్ నెహ్రూ నగర్ లో పిల్లలకు పొగాకు వల్ల నష్టాలపై డ్రాయింగ్ వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు.
గెలుపొందిన వారికి స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఫౌండర్ సెక్రటరీ, కె. సాయిబాబా “2 “క్రికెట్ కిట్లు ఇవ్వగా లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్,లయన్ జి.కృష్ణవేణీ,అంగన్వాడీ టిచర్ కవిత, ఆయా విజయ క్రికెట్ కిట్లు, షటిల్ బ్యాడ్మింటన్ లు, పుస్తకాలు బహుమతులను అందజేశారు.
ఈ సంవత్సరం థీమ్ హానికరమైన పొగాకు ఉత్పత్తులతో యువతను లక్ష్యంగా చేసుకోవడం అంతం కావాలనే విషయంపై దృష్టి సారించిందన్నారు.
యువతపై పొగాకు హానికరం పైఅవగాహన పెంచడానికే ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఇప్పటికే పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతుంటే , ఈ పొగాకు వల్ల మరింత హానికరం పెరుగుతుందన్నారు.
బాలలూ వాటి కోరల్లో చిక్కుకోవడం ఆందోళనపరిచేదేనేనన్నారు. యువత ఎక్కువగా హుక్కా, ఈ-సిగరెట్ వంటి వాటికి ఆకర్షితులవడం వల్ల వారి ఆరోగ్యాన్ని గుల్లచేస్తాయని హెచ్చరించారు.
పనిచేసే వయసులోని వ్యక్తుల దుర్మరణాల మూలంగా ఇండియా ఏటా రూ.46 వేల కోట్ల మేరకు ఉత్పాదకతను నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
.ప్రపంచవ్యాప్తంగా, కనీసం 37 మిలియన్ల మంది యువకులు 13-15 సంవత్సరాల మధ్య పొగాకును ఉపయోగిస్తున్నారని తెలిపారు. 13-15 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలలో 11.5%, బాలికలలో 10.1% పొగాకు వినియోగదారులు (4 మిలియన్లు).వాడుతున్నారన్నారు.
వ్యాపారాల కోసం పొగాకు పరిశ్రమ యువతను ఎందుకు టార్గెట్ చేస్తోందని హెచ్చరించారు . పొగతాగడం వల్ల వచ్చే సమస్యలు వాసనలనూ గ్రహించలేరని, ఊపిరి సమస్యలు, క్యాన్సర్,గుండె పోటు,ఎముకలూ. బలహీనపడే కాళ్లు,వినికిడి సమస్యలు, మగతనమూ దెబ్బతింటుందని తెలిపారు.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. పొగ పీల్చడమే కాదు పొగాకు సంబంధిత ఏ పదార్థాలు శరీరంలోకి వెళ్ళినా హానికరమే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అని చెప్పారు.
అర్ధాంతర మరణాలకు కారణమవుతూ ఎన్నో కుటుంబాల్లో శోకాగ్నులు రగి లిస్తున్న నోటి క్యాన్సర్ వల్ల దేశార్థికానికీ తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు.
ఈ హాని కలిగించే సమూహాలను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్ జి.కృష్ణవేణీ,అంగన్వాడీ టిచర్ కవిత, ఆయా విజయ పాల్గొన్నారు.