meta-layoffs

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,మార్చి 7,2023: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ గతేడాది నవంబర్‌లో 13 శాతం మంది సిబ్బందిని తొలగించిన తర్వాత మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.

మరింత సమర్ధవంతంగా మారేందుకు అలా చేస్తున్నట్టు గతంలోనే కంపెనీ వెల్లడించింది. ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, మాతృ సంస్థ అయిన మెటా ప్లాట్‌ఫారమ్‌లు మరో సారి తొలగింపులకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం రోజుల్లో వేలాది మంది ఉద్యోగులు లే ఆఫ్స్ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

గతేడాది13 శాతం మంది ఉద్యోగులను తొలగించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ గతేడాది నవంబర్‌లో 13 శాతం ఉద్యోగులను తొలగించిన తర్వాత మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మరింత సమర్ధవంతంగా మారేందుకు అలా చేస్తున్నట్టు ఇంతకుముందు తొలగింపుల సమయంలో కంపెనీ తెలిపింది.

మొదటి సారి తొలగింపుసమయంలో కంపెనీ నుంచి11000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించారు. అందులోభాగంగానే కంపెనీ అవసరం లేని టీమ్‌లను పూర్తిగా తొలగిస్తోంది.

ఫిబ్రవరిలో బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కంపెనీ ఈ ప్రక్రియను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది పర్మినెంట్ ఉద్యోగులు నష్టపోవచ్చని తెలుస్తోంది.

జుకర్‌బర్గ్ పేరెంటల్ లీవ్‌పై వెళ్లడానికి ముందే ప్లాన్ రెడీ అవుతుంది. ఈ సారి తొలగింపులు వచ్చే వారంలో ఉండవచ్చని సమాచారం.

meta-layoffs

జుకర్‌బర్గ్ 2023ని సమర్థత సంవత్సరంగా అభివర్ణించారు

నవంబర్‌లో ఉద్యోగుల తొలగింపు ఆశ్చర్యం కలిగించిందని, అయితే ఈసారి ఉద్యోగుల తొలగింపును ముందుగానే ఊహించారు. జుకర్‌బర్గ్ 2023ని మెటా కోసం “ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ”గా పిలిచారు.

పనితీరు సమీక్షల సమయంలో కంపెనీ ఈ థీమ్‌ గురించి ఉద్యోగులకు పరోక్షంగా సమాచారం అందించింది. అయితే దీని ప్రకారం తొలగిపుల కసరత్తు గత వారం పూర్తయినట్లు తెలుస్తోంది.

కాలిఫోర్నియా-ఆధారిత కంపెనీ మెన్లో పార్క్ కార్యాలయంలోని కార్మికులు సహోద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు కోల్పోతే ఈ నెలలో పంపిణీ చేయాల్సిన బోనస్ అందుతుందా అని కొందరు ఉద్యోగులు సందేహిస్తున్నారు.