ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ – ఇండియా, అధ్యక్షురాలు డా హిప్నో పద్మా కమలాకర్, డా.వి.జే.క్యార్లిన్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 20,2024:సైకాలజిస్టుల వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు సైకియాట్రిస్ట్ డా.రవ్వ హరి కుమార్ తో ( Anxiety disorders Assessment and psychological management) ఆందోళన నిర్ములనా మార్గాలు పై ఒక రోజు జాతీయ స్థాయి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ – ఇండియా, అధ్యక్షురాలు డా హిప్నో పద్మా కమలాకర్, డా.వి.జే.క్యార్లిన్ తెలిపారు.

సోమవారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డా హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్,అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ లో జరుగుతుందన్నారు.

కరోనా తర్వాత ప్రతి ఒక్కరులో చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

సైకాలజిస్ట్ లు ఈ సమస్యను ఎలా అంచనా వేయాలి, వారి మానసిక స్థితి గతులు ఎలా తెలుసుకోవాలి అనే అంశంపై డా.రవ్వ హరి కుమార్ అవగాహన కల్పిస్తారన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డా.జి.వీరభద్రం, డా.వి.జనార్థనం, డా.పి.రమేష్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్టులు, సైకాలజీ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు.

వివరాలకు 9390044031 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.

ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ – ఇండియా, డా హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్,* అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.
సెల్ @ 9390044031

ఇదికూడా చదవండి:  భారతదేశంలో 5వ దశకు ఓటింగ్.. గూగుల్ ప్రత్యేక డూడుల్‌..

ఇదికూడా చదవండి: వాట్సాప్‌లో ఎవరి మెసేజ్ వచ్చిందో మీ ఫోన్ చూడకుండానే తెలుసుకోవచ్చు..