Sun. Dec 22nd, 2024
accident

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సంగారెడ్డి, నవంబర్ 20,2022: పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇస్నాపూర్‌ వద్ద ఎన్‌హెచ్‌-65పై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు బస్సును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన విద్యార్థుల బృందం కారులో గోవా పర్యటనకు వెళ్లింది. తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా అదే మార్గంలో వెళ్తున్న ప్రైవేట్ బస్సును కారు ఢీకొట్టింది. మృతుడు జయ సాయి(21)గా గుర్తించారు. కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

accident

పోలీసులు ఆన్‌లైన్‌లో కారు వివరాలను పరిశీలించగా, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో వాహనంపై మూడు ర్యాష్ డ్రైవింగ్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదైంది.

error: Content is protected !!