Fri. Nov 22nd, 2024
OPJindal-Global-University

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్10,2022: ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, సియాటిల్ యూనివర్సిటీలు కలిసి కొత్త విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు సిధ్దమయ్యయి. ఈ భాగస్వామ్యం ఉన్నత విద్యలో విద్యార్ధులు, అధ్యాపకులకు సరికొత్త సృజనాత్మక అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుంది.

ఈ ఎంఓయూ ద్వారా సియాటెల్ విశ్వవిద్యాలయంతో స్నేహం, సహకారాన్ని బలోపేతం చేయడానికి ముందడుగు వేయనున్నారు. అంతేకాదు సహకార పరిశోధన, ఉమ్మడి ప్రచురణలు, గ్రంథాలయ మార్పిడితోపాటు, అధ్యయనం, బోధన, పరిశోధన కోసం ఫ్యాకల్టీ, విద్యార్ధుల మార్పిడి కార్యక్రమాలు, అధ్యయనం లేదా సేవ కోసం కార్యక్రమాలు, సదస్సులు, ఉపన్యాసాలు, సెమినార్లలో పాల్గొనడానికి సంస్థల మధ్య స్కాలర్ల మార్పిడి జరగనుంది.

OPJindal-Global-University

ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎడ్వర్డ్ పెనాల్వర్ మాట్లాడుతూ, “సియాటెల్ విశ్వవిద్యాలయం పసిఫిక్ నార్త్ వెస్ట్ లో సియాటెల్ ప్రాంతంలో అతిపెద్ద స్వతంత్ర విశ్వవిద్యాలయం, సియోటెల్ విశ్వవిద్యాలయంలో కాలేజ్ ఆఫ్ రింగ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్, లా అండ్ బిజినెస్ లాంటి ఆరు కళాశాలలు ఉన్నాయి. మా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కోర్సులు కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ లో ఉన్నాయి.

మా విద్యార్థులు మీ అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. కచ్చితంగా మా విద్యార్థులు స్కాలర్లు మా అనుభవం నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల నాయకులను, విద్యావంతులను రూపొందించడానికి వ్యక్తిగత స్థాయిలో సంబంచాలన సృష్టించడానికి సంస్థాగత స్థాయిలో సంబంధాలను మనం నిర్మించుకోవాలి” అన్నారు.

సియాటెల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ఎం పెనాల్వర్, డీన్ ప్రొఫెసర్ ఆందోనీ ఇ ఎరోనా స్కూల్ ఆప్ ), డీన్ ప్రొఫెసర్ (డాక్టర్) అమిత్ శుక్లా (కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్), డీన్ ప్రొఫెసర్ (డాక్టర్) జోసెఫ్ ఎం ఫిలిప్స్ (అల్బర్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనమిక్స్), అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ (డాక్టర్) మధు టి. రావు (అల్బర్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనమిక్స్) తో కూడిన ప్రతినిధి బృందం ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తోంది.

.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి ప్రొఫెసర్ డా.రాజ్ కుమార్ మాట్లాడుతూ “ఉన్నత విద్యను ప్రోత్సహించడంలో, ఉన్నత విద్యారంగంలో నాయకత్వాన్ని అందించడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. భారతదేశంలో జాతీయ స్థూల నమోదు నిష్పత్తి సుమారు 25శాతం నుంచి 27శాతం వరకు ఉంటుంది. ఉన్నత విద్య విషయంలో తెలంగాణ స్థూల నమోదు నిష్పత్తి 52శాతానికి పైగా ఉంది.

OPJindal-Global-University

కాబట్టి ఉన్నత విద్యకు సంబందించినంత వరకు తెలంగాణ నిజంగా దేశంలోనే అగ్రగామి. మెడికల్ స్టడీస్, ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ ఎడ్యుకేషన్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ రంగాల్లో కూడా తెలంగాణ ముందంజలో ఉంది. కాబట్టి సియాటెల్ విశ్వవిద్యాలయం భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని యోచిస్తున్నప్పుడు, వారు తెలంగాణను.. వాస్తవానికి హైదరాబాద్ నగరాన్ని సందర్శించడం చాలా సముచితం.

మేము ఇక్కడ ఉండటానికి మూడో కారణం ఏమిటంటే, విద్య నాణ్యతను మెరుగుపరచడం, భారతీయ సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ సంస్థలతో టెంచ్ మార్క్ చేయడం, బోధన, పరిశోధనలో శ్రేష్టతను ప్రోత్సహించడం, నేషనల్ రీసెర్చ్, ఫౌండేషన్ ద్వారా పరిశోధన వ్యవస్థను అభివృద్ధి చేయడం లాంటి అనేక అంశాలపై జాతీయ విద్యావిధానం దృష్టి సారిస్తుంది. ఈ విధానంలోని అత్యంత క్లిష్టమైన అంశాలలో ఒకటి.. అంతర్జాతీయీకరణ, ప్రపంచ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం” అని తెలిపారు.

సియాటెల్ విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ ప్రతినిధి బృందానికి ఒ.పి.జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ క్యాబిన్ లో ఆతిధ్యం ఇస్తున్నారు. అక్కడ అధ్యకుడు పెనాల్వర్ “విద్యా స్విచ్ఛ, విశ్వావిద్యాలయాల భవిష్యత్తు” అనే అంశంపై ఒక విశిష్ట బహిరంగ ఉపన్యాసం ఇచ్చారు. సహకారంలో కొత్త మార్గాలను రూపొందించడానికి ప్రతినిధి బృందం విజయులోని కీలక వాటాదారులతో చర్చిస్తోంది.

ఎన్ యు నుంచి ఒక ఉమ్మడి ప్రతినిధి బృందం ఐదు నగరాల పర్యటనకు బయలుదేరింది. దీనిలో రెండు విశ్వవిద్యాలయాల సీనియర్ నాయకత్వం పెరుగుతున్న ప్రపంచీకరణ పరిస్థితులలో ఉన్నత విద్య భవిష్యత్తుపై విద్యార్ధులు, విద్యావేత్తలు, ఛాట్ లీడర్లతో సంభాషించనుంది.

OPJindal-Global-University

అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ ప్రకారం: విద్యార్ధుల మార్పిడి, ఫ్యాకల్టీ పరిశోధన సహకారం, ఇతర కార్యకలాపాలను సులభతరం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలతో భాగస్వామ్యం కోసం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు చాలా కాలంగా చూస్తున్నాయి.

సమగ్ర అంతర్జాతీయీకరణను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలలో భాగంగా, అనేక సంస్థలు అంతర్జాతీయ భాగస్వాములను గుర్తించడంలో, కాలక్రమేణా అభివృద్ధి చెందే బహుముఖ సంబంధాలను పెంపొందించడంలో మరింత వ్యూహాత్మకంగా మారడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఇవి విస్తృత సంస్థాగత లక్ష్యాలను ముందుకు తీసుకువెళతాయి. అంతర్జాతీయ భాగస్వామ్యాలు విధానాలు, కీలక సమస్యలు, సవాళ్లు, వ్యూహాత్మక ప్రణాళిక, విజయవంతమైన సహకారాల అమలు కోసం మంచి పద్ధతులను అన్వేషిస్తాయి.

error: Content is protected !!