
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్, తిరుపతి,జూన్ 28,202: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ గురువారం నుంచి ఓపి, ఇన్ పేషంట్ సేవలు పునఃప్రారంభించనున్నట్లు ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని చెప్పారు. ఆపరేషన్లు అవసరమైన కేసులు అడ్మిట్ చేసుకుంటామని ఆయన వెల్లడించారు.