Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్ ,ఏప్రిల్ 4,2022:విస్తృత శ్రేణిలో, 2‌.4 బిలియన్ డాలర్ల విలువ కలిగిన సి.కె.బిర్లా గ్రూపులోని ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ తన కొత్త ఫిన్‌స్టార్ శ్రేణి టేబుల్, వాల్,స్టాండ్ ఫ్యాన్లను విడుదల చేయగా, అవి స్టైల్, పనితీరు,అందుబాటు ధరల్లో పరిపూర్ణమైన సంయోజనను
అందిస్తాయి. ఈ విడుదలతో తన పోర్ట్‌పోలియో క్రోడీకరించే అలాగే దక్షిణ భారతదేశంలో తన వ్యాప్తిని సదృఢం చేసుకునే ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి.
ఓరియంట్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు అతుల్ జైన్ మాట్లాడుతూ, ‘‘దక్షిణ భారతదేశంలో పలువురు వేడి అలాగే తేమతో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు ,దానితో హై-థ్రస్ట్ ఎయిర్ ఫ్లో కలిగిన పోర్టబుల్ ఫ్యాన్లకు అపారమైన డిమాండ్ ఉంది.

మేము వరుసగా ఉన్నత విలువల ప్రస్తావనను కలిగిన కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుండగా, ఈ ప్రాంతంలో వినియోగదారుల అవసరాలను భర్తీ చేస్తున్నాము. మా కొత్త ఫిన్‌స్టార్ పోర్టబుల్ ఫ్యాన్లు స్టైలిష్ రూపంతో అందుబాటులోకి వచ్చాయి.ఇవి సదృఢమైన మోటార్‌తో తయారుగా ఉంటూ, అవి దీర్ఘకాలిక మన్నిక,ఉన్నతమైన గాలి నాణ్యతను ఇస్తాయి. ఈ శ్రేణి ఉత్పత్తుల విడుదలతో మేము విస్తారమైన శ్రేణిలో టేబుల్, వాల్,స్టాండ్ ఫ్యాన్లను ఈ ప్రదేశంలో అందుబాటులోకి తీసుకు వస్తుండగా, ప్రతి స్థలం, అవసరం,బడ్జెట్‌కు ఇవి ఒదిగిపోతాయి. ఈ శ్రేణిలో విస్తరణ మాకు దక్షిణ భారతదేశంలో ఈ వర్గంలో మార్కెట్ వాటా వృద్ధి చేసుకునుందకు సహకరిస్తుందన్న నమ్మకం మాకు ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.ఓరియంట్ ఫ్యాన్లు 400 ఎం.ఎం. స్వీప్‌తో 85 ఎం.ఎం. ఇంప్రెసివ్ ఎయిర్ డెలివరీని ఇస్తాయి.ఇతర ప్రత్యేకతల్లో థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్, తుప్పు పట్టడానికి వ్యతిరేకంగా రక్షణకు పౌడర్ కోటెడ్ గార్డ్ మరియు రింగ్‌తో ఉన్నతీకరించిన రక్షణ, 90-డిగ్రీ ఆసిలేషన్‌తో ఎగువ,దిగువకు టిల్ట్ మెకానిజం,3-స్పీడ్ పియానో స్విచ్ కంట్రోల్‌ను కలిగి ఉంటాయి.

ఓరియెంట్ ఫిన్‌స్టార్ స్టాండ్ ఫ్యాషన్ ఎత్తుకు అలవర్చుకునేందుకు టెలిస్కోపిక్ అరేంజ్‌మెంట్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫ్యాన్లు మూడు సొగసైన ఫినిషింగ్‌లు ఎరుపు, తెలుపు,నీలి వర్ణంతో అందుబాటులోకి రాగా, అవి ఏ స్థలానికి అయినా ఒదిగి పోతాయి.కొత్త ఫిన్‌స్టార్ శ్రేణి పోర్టబుల్ ఫ్యాన్లు మాత్రమే కాకుండా ఓరియంట్ ఎలక్ట్రిక్ ఇటీవల తన ఎగ్జాస్ట్,అలంకారిక ఫ్యాన్ల శ్రేణికీ విస్తరించగా, కొత్త మోడళ్లు వినియోగదారులకు వివిధ విభాగాల్లో విస్తృత శ్రేణిలో ఎంపికలను అందిస్తుంది.

error: Content is protected !!