365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమెరికా, మార్చి15, 2023: రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)తెలుగు సినిమాలోని “నాటు నాటు” పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ప్రపంచ సినీ అత్యున్నత పురస్కారం “ఆస్కార్” అందుకున్నది.
ఈ శుభ సందర్భంగా సరస్వతి పుత్రుడు, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ కు, సంగీత దర్శకుడు కీరవాణితోపాటు చిత్ర యూనిట్ మొత్తానికి అమెరికన్ ప్రోగ్రస్సివ్ తెలుగు అసోసియేషన్(ఆప్త)అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ కొట్టె అభినందనలు తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్నచంద్రబోస్ అట్లాంటా విచ్చేసిన సందర్భంగా ఆప్త ప్రెసిడెంట్ ఉదయ్ భాస్కర్ కొట్టె నాయకత్వంలో చంద్రబోస్ కు ఆప్తులు ఘన స్వాగతం పలికి, అమెరికా లో ఆప్తులందరి తరుపున శుభాభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు.
యావత్ తెలుగు ప్రజలే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూసిన కల నెరవేర్చారని, భవిష్యత్తులో తెలుగు తనం, తెలుగు నేటివిటీ తో మీ కలం నుంచి మరెన్నో ఆణిముత్యాలు, అక్షర తుణీరాలు విరజిల్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా భాస్కర్ కొట్టే అట్లాంటా లో సెప్టెంబర్ 1తేదీ నుంచి 3 తేదీల్లో కన్నుల పండువగా జరిగే 15వసంతాల ఆప్త కన్వెన్షన్ కు చంద్రబోస్ ను సాదరంగా ఆహ్వానించారు. అడిగినదే తడవుగా చంద్రబోస్ అంగీకరించి ఆప్త పట్ల తమకున్న ప్రత్యేక ప్రేమను చాటుకున్నందుకు ఆప్త తరపున సభ్యులందరూ కృతజ్ఞతలు తెలిపారు.