Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మార్చి 11,2022:ఎదుగుదల అనేది దాని స్వంత సవాళ్లు ,విజయాల సాధనల సమ్మేళనంగా,దానినిఅనుభవించే వ్యక్తి మాత్రమే అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. పిక్సర్,డిస్నీ+ హాట్‌స్టార్ తాజాగా అందుబాటులోకి తీసుకు వస్తున్న యానిమేషన్ చిత్రం టర్నింగ్ రెడ్, రహస్య శాపపు ఫలితాన్ని చూపిస్తుంది. దీనిలో కథానాయిక, 13 ఏళ్ల మెయి లీ (రోసాలీ చియాంగ్ గాత్రదానం చేసింది), ఆమె మానసికంగా ప్రేరేపించబడినప్పుడల్లా ఒక పెద్ద మృదువైన ఎరుపు పాండాగా మారుతుంది. ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నప్పటికీ తేలికగా ఆవేశానికి గురికాబడుతుంది. ఈ రహస్యాన్ని తన పాఠశాల,సమాజంలోని ఇతరులు తెలుసుకోకుండా అడుకునేందుకు నేర్చుకోకుండా నిరోధించడానికి మెయి లీ ఇప్పుడు తన భావోద్వేగాలను నియంత్రించుకోవడాన్ని నేర్చుకోవాలి. ఈ

విషయంలో ఆమెకు సహాయం చేసేందుకు, ఆమె తన విశ్వసనీయ స్నేహితుల బృందం,సహాయక కుటుంబాన్ని కలిగి ఉంది.తెరపై ఉన్న అడ్డంకుల ప్రాతినిధ్యాన్ని కచ్చితత్వంతో సూచిస్తూ, డోమీ షి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కెనడాలోని వలస కుటుంబాల సాంస్కృతిక అంశాలను హైలైట్ చేస్తోంది. టొరంటో నగర
జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంలో దాని వలస పాత్రల ఆహారం, అలంకరణ,నమ్మకాలను అద్భుతంగా,ఉల్లాసంగా చూపిస్తుంది. ఈ కథనం మెయి లీ,ఆమె తల్లి (సాండ్రా ఓహ్ గాత్రదానం చేసింది) ఆమెతో పుష్-పుల్ రిలేషన్‌షిప్‌లో బోనులో బంధించబడినప్పుడు, హృదయాన్ని కదిలించే, బలమైన ,ఇంకా విడిపోయిన బంధాన్ని చూపిస్తుంది.

అద్భుతమైన విజువల్స్, అద్భుతమైన రచన,మెప్పించే,భావోద్వేగాలపై దృష్టి సారించే కథనాన్ని కలిగిన టర్నింగ్ రెడ్ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది ,పిక్సర్‌ తమ నైపుణ్యంతో రూపొందించిన విలక్షణమైన పాత్రలు మీకు అనుసంధానం అవుతాయి. ఈ చిత్ర రూపకల్పనను ఆకర్షణీయమైన వీక్షణగా మార్చేందుకు సహకరించిన మెయి లీ స్నేహితుల ప్రతి ఒక్కరి విస్తృతమైన వివరాలను మర్చిపోకూడదు.

టర్నింగ్ రెడ్ అనేది ధైర్యమైన, జీవితాన్ని ధృవీకరించే చిత్రం కాగా, ఇది రుతుక్రమం, హార్మోన్ల మార్పులు, క్రష్‌లు,శరీరంలో వచ్చే మార్పులు తదితర వంటి కౌమార సమస్యలను సూక్ష్మంగా అభివ్యక్తీకరిస్తుంది. ఇది ప్రాతినిధ్యాన్ని కేవలం ‘జాగృతం’ అయ్యే థీమ్‌గా ఉపయోగించడాన్ని అధిగమించింది. దాని బదులుగా, ఇది తన కథనాన్ని ముందుకు తోడ్కొని వెళ్లేందుకు విలక్షణ-సాంస్కృతిక పట్టణ సెట్టింగ్‌ను తెలివిగా వినియోగించుకుంది. ఫలితంగా పిక్సర్

తెరపైకి తన మాయాజాలాన్ని తీసుకు వచ్చి గుర్తించదగిన కళాఖండంగా మలిచేందుకు అవకాశాన్ని
దక్కించుకుంది.

error: Content is protected !!