Wed. Dec 4th, 2024
fashion-expo

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైద‌రాబాద్‌, జూలై17, 2022: సేంద్రియ‌ ఉత్ప‌త్తులతో కూడిన క్యూరేటెడ్ ప్లాట్‌ఫాం అయిన అవ‌ర్ బెట‌ర్ ప్లానెట్ హైద‌రాబాద్‌లో ‘కాన్షియ‌స్ సోక్ 3.0’ అనే పేరుతో ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ఉత్ప‌త్తుల‌తో రూపొందించిన వ‌స్త్రాలు, యాక్సెస‌రీస్, ఇత‌ర వ‌స్తువుల ప్ర‌ద‌ర్శ‌న‌, అమ్మ‌కం విజ‌య‌ వంత‌మైంది. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు, ప‌లువురు ప్ర‌ముఖులు ఇందులో పాల్గొని, త‌మ‌కు న‌చ్చిన ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేశారు. వినియోగ‌దారులు మెరుగైన జీవ‌న‌శైలిని ఎంచుకుని, ప‌ర్యావ‌ర‌ణంపై సానుకూల ప్ర‌భావం చూపాల‌న్న‌దే అవ‌ర్ బెట‌ర్ ప్లానెట్ ఉద్దేశమ‌ని నిర్వాహ‌కులు ఈ సంద‌ర్భంగా తెలిపారు.

fashion

అవ‌ర్ బెట‌ర్ ప్లానెట్ ప్లాట్‌ఫాం నిర్వ‌హించిన ఈ పాప్-అప్ ఈవెంట్, కాన్షియస్ సోక్ అనేది వివిధ మార్కెట్లకు ఒక గొప్ప స్టోరీతో ప్రత్యేకమైన బ్రాండ్లను సమర్పించే కార్య‌క్ర‌మం. కొత్త మార్కెట్లకు వ్యాపార పరిధిని విస్తరించేటప్పుడు సుస్థిరతతో అనుసంధానం కావడానికి సహకారంగా ఉండే వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. అవ‌ర్ బెట‌ర్ ప్లానెట్ ఒక మంచి వాతావరణం కోసం తమ వంతు కృషి చేస్తున్న భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కూడిన స‌మాజాన్ని సృష్టించాలని భావిస్తోంది.

fashion-expo

ప్ర‌ద‌ర్శ‌న‌లో అందించిన కొన్ని బ్రాండ్లు ఇవీ..

కేన్సిల్డ్ ప్లాన్స్ – ఔష‌ధ వ్య‌ర్థాలను రీసైకిల్ చేసి రూపొందించిన దుస్తులు, బ్యాగులు,రిమాజిన్డ్ – టైర్లు, దుస్తుల వ్య‌ర్థాల‌న్నింటితో రూపొందించిన‌వి, క్రెవెల్ – శ్రీ‌న‌గ‌ర్ నుంచి కార్పెట్లు, క‌వ‌ర్లు, ఎఫీ-ఆరుగురు మ‌హిళ‌లు న‌డిపేది, బాకా & సిల్వ‌ర్ లైనింగులు – భ‌ర‌ణీయ ఎథిక‌ల్ జ్యూవెల‌రీ,వూవెన్ ల్యాబ్,యార్న్ ఇండియా -చేనేత వ‌స్త్రాల స‌మాగ‌మం, హోమ్ గ్రెయిన్ – చెక్క‌తో త‌యారుచేసిన డెకార్, కిచెన్ వ‌స్తువులు,కిండోరా – సేంద్రియ చెక్క‌, ప‌త్తి, పిల్ల‌ల‌కు అనుకూలంగా ఉండే సామాగ్రితో చేసిన బొమ్మ‌లు,విండీ-సేంద్రియ ప‌త్తితో చేసిన వ‌స్త్రాలు,సేంద్రియ ప‌త్తిసాగుకు ప్రోత్సాహం.

fashion

అవర్ బెటర్ ప్లానెట్ వ్య‌వ‌స్థాప‌కురాలు, సీఈవో పల్లవి శ్రీవాస్తవ మాట్లాడుతూ, “డీఏఈ మీడియా సహకారంతో హైదరాబాద్‌లో కాన్షియ‌స్ సోక్ మూడో చాప్ట‌ర్ శ‌నివారం నిర్వ‌హించాం. మొదటిది గోవాలో, రెండోది బెంగ‌ళూరులో జ‌రిగాయి. ప్లాన్ చేసిన అన్ని ఈవెంట్లతో స‌మాజంలో చేత‌న క‌లిగించాల‌ని, భ‌ర‌ణీయ వ‌స్తువుల‌ను అంద‌రూ ఆమోదించేలా చేయ‌డంతో పాటు.. ఈ బ్రాండ్ల‌ను కొత్త వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేయాల‌న్న మా ల‌క్ష్యం ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో నెర‌వేరింది. ఫ్యాషన్, అలంకరణ, వెల్ నెస్, యాక్ససరీలు, ఇంకా ఎన్నో విభిన్న సెగ్మెంట్ల‌లో దేశవ్యాప్తంగా జాగ్రత్తగా క్యూరేట్ చేసిన బ్రాండ్ల సమూహాన్ని ఒకచోట చేర్చినందుకు, ఇందులో పాల్గొన్న‌ ప్రతి బ్రాండ్ కూడా స్థిరమైన ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో భాగంగా తమ బ్రాండ్ స్టోరీని తెలియ జేయడానికి సాయ‌ప‌డినందుకు మేం ఎంత‌గానో సంతోషిస్తున్నాం” అని చెప్పారు.

fashion-expo

తాము ఏం కొంటున్నామో బాగా తెలిసిన‌వారు, అది క‌లిగించే ప్ర‌భావం గురించి జాగ్ర‌త్త ప‌డేవారి కోసం క్యూరేట్ చేసిన ప్లాట్‌ఫాం.. అవర్ బెటర్ ప్లానెట్. మ‌న ఎంపిక‌లు స‌రిగా ఉంటే, ఈ భూమి ఎదు ర్కొంటున్న ప్రస్తుత పర్యావరణ, సామాజిక, ఆర్థిక సమస్యలను పెంచే,తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి. స్థానిక చేతివృత్తులవారు, సహజ ఉత్పత్తులు, సామాజికంగా వెనుకబడిన వ‌ర్గాలు, చట్టబద్ధమైన కారణాలపై దృష్టి సారించడంలో సహాయపడే సామాజిక సంస్థలు రూపొందించిన ఉత్ప‌త్తుల‌న్నీ ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో అందుబాటులో ఉంచారు.

error: Content is protected !!