
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్, 29 డిసెంబర్,2021: గత రెండేళ్లు ప్రతి ఒక్కరి పరస్థితి రంగుల రాట్నంగా మారిపోయింది. కానీ ఇది ప్రతి ఒక్కరి శక్తిని,స్థిరత్వాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించింది- ఇది మొదటి వరుసలో నిలబడి పోరాటం చేయడం, వేగవంతమైన ఇనాక్యులేషన్ డ్రైవ్‌లు లేదా తల్లిలాంటి ప్రకృతిని అన్వేషించే విశ్వాసాన్ని పెంపొందించింది. కొవిడ్ అల పెరుగుతున్నప్పటికీ, ప్రజల మనస్సుల్లో నిలిచి ఉన్న ఏదో ఒక అంశం ఉంటే అది ప్రయాణమేనని స్పష్టమైంది. లాక్‌డౌన్ నుంచి ప్రపంచం తలుపులు తెరుచుకున్న వెంటనే, ప్రయాణికులు రోడ్ల పైకి వచ్చి తమ ప్రయాణాలను
ప్రారంభించారు.
ఇది కేవలం మా ఆలోచనలు, అభిప్రాయాలు లేదా మన అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్స్ ఆధారంగా చెప్పడం లేదు! భారతదేశం,ఇండోనేషియా ,ఐరోపాతో సహా కొన్ని ప్రధాన మార్కెట్‌లలో ప్రయాణ ఉద్దేశం,తన జాబితాలోని వినియోగదారులతో అంచనాలను అధ్యయనం చేసేందుకు ఓయో ప్రత్యేకంగా వినియోగదారులతో సమీక్ష నిర్వహించి; ఓయో నాల్గవ సంవత్సరాంతపు వార్షిక సూచిక -‘ఓయో ట్రావెలోపీడియా 2021ను విడుదల చేసింది.
2021లో ఆధిపత్యం చెలాయించిన వర్క్‌కేషన్‌ల నుంచి,దేశీయ ఆఫ్‌బీట్ గమ్యస్థానాలను అన్వేషించడం వరకు, ఇన్‌స్టాగ్రామ్‌లో డూమ్ స్క్రోలింగ్,2022లో మరిన్ని ప్రయాణాలు చేయడం వరకు, 2021లో వినియోగదారులు ఎలా ప్రయాణించారు,2022లో వారి తీర్మానాల నివేదికను ఈ జాబితా స్పష్టంగా పేర్కొంది. కనుక మరింత ఆలోచించకుండా, మనం ఇక్కడకు వెళుతున్నాము.
భారతదేశం
ప్రతి ఒక్కరికీ 2020 కష్టంతో కూడిన ఏడాదిగా మిగిలిపోయింది.పుట్టినరోజులు, ఇతర ప్రధాన కార్యక్రమాలు, వేడుకలు తదితరాలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. విద్యార్థులు పండుగ వేడుకల కోసం ఇంటికి తిరిగి వెళ్లలేకపోయారు, తమ స్నేహితులతో వీడియో కాల్స్ చేసుకుని విందులు చేసుకోవలసి వచ్చింది. కానీ 2021 కొంత భిన్నంగా ఉంది. ఓయో ట్రావెలోపీడియా ప్రకారం, సమీక్షకు స్పందించిన వారిలో సుమారుగా 65% మంది గత 6 నెలల్లో ప్రయాణాలు చేయగా, వారిలో ఎక్కువ మంది తమకు అత్యంత ఆప్తులు, ప్రియమైన
వారిని కలుసుకున్నారు. కొందరికి తమ దినచర్యల నుంచి తప్పించుకోవడం ,విశ్రాంతి కోసం ప్రయాణించడం అవసరం. కొంతమంది తమ ఆర్థిక వ్యవస్థను కొనసాగించేందుకు,వారు వ్యాపార అవసరాల కోసం ప్రయాణించారు.
భారతదేశం స్థిరత్వంతో కూడిన దేశం- సామూహిక టీకా డ్రైవ్‌లతో, ప్రయాణించే ఉద్దేశం,విశ్వాసం తిరిగి వచ్చింది! సమీక్షకు స్పందించిన 60% మంది శీతాకాలపు సెలవల్లో తమ ప్రయాణాలకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఏదేమైనప్పటికీ, ఎక్కువ మంది తమ పర్యటన తేదీ దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 31% మంది తమ ప్రయాణాలను ఒక నెల ముందుగానే ప్లాన్ చేసుకుంటామని చెప్పగా, 26% మంది తమ ప్రయాణాన్ని ఒక వారం ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు ఇష్టపడతామని తెలిపారు. కొవిడ్ ముందస్తు రోజుల తీరుతో పోల్చితే ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది.

ఇంకేముంది?
*సెన్సార్ టవర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, ప్రయాణ మొబైల్ అప్లికేషన్‌లో, భారతదేశంలోని ఓయో వినియోగదారులు తమ ఓయో యాప్‌లో 3,232 ఏళ్లకు సమానమైన విలువైన సమయాన్ని వెచ్చించారు – భారతదేశంలో ఇది 2021 ఆర్థిక సంవత్సరంలో అత్యధికం.
*సుబహ్-షామ్. చాలా బాగుంటుంది. ఓయో యాప్‌లో బుకింగ్‌లు చేసుకునేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన సమయం ఉదయం 11:00- మధ్యాహ్నం 1:00 ,సాయంత్రం 6:00 – రాత్రి 9:00.
*ఫ్యాన్ అలర్ట్: భారతదేశానికి చెందిన ఒక ట్రావెల్ ఏజెంట్ 2021లో ఓయో
కోసం 1193 బుకింగ్‌లు చేసారు
*ఓయో అతి పెద్ద బుకింగ్‌లో ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారుడు 36 మంది కోసం 72 రాత్రులకు ఓయోలో బుకింగ్ చేశారు.
కొండలు > బీచ్‌లు > ఆఫ్ ది బీటెన్ ట్రాక్
కొండ ప్రాంతాలు vs బీచ్ ఎంపిక ఇప్పటికీ సమానంగానే ఉండగా, సమీక్షకు స్పందించిన వారిలో 35% మంది పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడగా, 24% మంది బీచ్‌లకు వెళ్లేందుకు ఇష్టపడతామని చెప్పారు. కానీ సమీక్షకు స్పందించిన వారిలో అత్యధికంగా 53% మంది తాము ఆఫ్‌బీట్ దేశీయ గమ్యస్థానాలను అన్వేషింస్తామని తెలిపారు. రోడ్‌ట్రిప్‌ల పట్ల భారతీయులు ఇప్పటికీ మక్కువ చూపిస్తున్నారు. సమీక్షకు స్పందించిన వారిలో సగానికి పైగా తాము ప్రైవేట్ లేదా అద్దె కార్లలో ప్రయాణిస్తామని చెప్పగా, 35% మంది బస్సులో లేదా రైలులో ప్రయాణించడం చాలా బాగుంటుందని పేర్కొన్నారు. కేవలం 14% మంది మాత్రమే విమానంలో ప్రయాణించడం సంతోషంగా
ఉంటుందన్నారు. వినియోగదారులలో ఎక్కువ మందికి హోటళ్లు అత్యధిక వసతి సదుపాయాల ఎంపికగా ఉన్నాయి. పర్యాటకుల్లో 60% మంది వీటిని ఎంచుకుంటుండగా, మిగిలిన వారు సరస్సు,నది లేదా బీచ్ రిసార్ట్‌లు,వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.అలాగే, 2022లో అన్ని ప్రాంతాలు చుట్టి వచ్చేందుకు సమయం ఆసన్నమైంది! కనుక, భారతదేశం వేడుక చేయాలని ప్రణాళిక చేస్తుంది? ఈ విషయంలో భారతదేశం సరిహద్దులో ఉన్నట్లు కనిపిస్తోంది.
సమీక్షకు స్పందించిన వారిలో 44% మంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త ఏడాదిని కుటుంబ సభ్యులు, స్నేహితులతో వేడుక చేసుకుంటామని చెప్పగా, మరో 44% మంది కుటుంబం,స్నేహితులతో కలిసి ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నా మని తెలిపారు.భారతదేశం ఏమి చేసినా, ఒక విషయాన్ని కచ్చితంగా చెప్పవచ్చు, అది ‘కుటుంబం,స్నేహితులతో’ ఉంటుంది. సరే, మనం నిజంగా,సగర్వంగా సామూహిక సమాజంలో ఉంటున్నాం కదా? ఎంత కాదననున్నా అవుననే చెప్పాలి! కానీ సమీక్షకు స్పందించిన వారిలో సుమారుగా 9% భారతీయులు కూడా #ఒంటరిగా ప్రయాణించడాన్ని ఎంచుకున్నారు – ఈ కొత్త ఏడాదిలో ఒక ఆత్మ శోధిస్తోంది.

వర్క్‌కేషన్ > పని, ప్రయాణం, పునరావృతం
ప్రపంచాన్ని 2020 మార్చేసింది.2021 అనేది రిమోట్‌గా పని చేస్తున్నప్పుడు కోల్పోయిన సెలవులను స్వీకరించడం,భర్తీ చేయడంతోనే కొనసాగింది. ఓయో ట్రావెలోపీడియా 2021 ప్రకారం, దాదాపు 48% మంది భారతీయులు ఏడాది మొత్త ఇంటి నుంచి పని చేసారు, వీరిలో 85% మంది వర్క్‌కేషన్‌లను లేదా ఇంటికి దూరంగా, సుందరమైన ప్రదేశంలో పని చేసేందుకు ఇష్టపడ్డారు.అలాగే, వీరిలో 61% మంది వర్క్‌కేషన్ తీసుకున్నారు. మరింత ఆసక్తికరమైనది ఏమిటి? దాదాపు
27% మంది నెల రోజుల పాటు పనిచేశారు. ఈ వర్క్ x ట్రావెల్ ట్రిప్‌లకు సంబంధించిన ప్రదేశాల జాబితాలో హిల్ స్టేషన్‌లు అగ్రస్థానంలో ఉండగా, తదుపరి స్థానాల్లో ఎక్కువ మంది తమ స్వస్థలాలు, బీచ్ డెస్టినేషన్లను సందర్శించారు. డిజిటల్ సంచార ఏడాది 2021కు అభినందనలు!
సరే. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పోలిక ఉంది. మనమందరం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే దోషులమే. మహమ్మారి సమయంలో డూమ్ స్క్రోలింగ్ ట్రావెల్ కంటెంట్ మీకు బాగా నచ్చిందా?అభియోగాలు మోపబడిన 54% భారతీయులు దోషులుగా తేలారు. దాదాపు 50% మంది భారతీయులు తమ తదుపరి పర్యటన కోసం స్ఫూర్తిని పొందేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయించామని చెప్పగా, 52% మందికి పైగా ఇన్‌స్టాగ్రామ్ ను తమ అగ్ర ఎంపికగా పేర్కొనగా, ఫేస్‌బుక్,యూట్యూబ్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
సమీక్షకు స్పందించిన వారిలో 35% మంది పాఠశాలల్లోని తమ పాత మిత్రులు ,తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రేరణ పొందడాన్ని కొనసాగించారు.కొత్త ఏడాదితో పాటు నూతన సంవత్సర తీర్మానాలు వస్తాయి.ఓయో నిర్వహించిన సమీక్షకు స్పందించిన వారిలో ప్రయాణానికి సంబంధించిన వారి కొత్త సంవత్సర తీర్మానాల గురించి అడిగింది.సమీక్షలో కంపెనీ గుర్తించిన అంశాలను ఇక్కడ పేర్కొంది.దాదాపు 30% ఓట్లతో, 2022లో ఎక్కువ ప్రయాణం చేయాలనేది భారతదేశంలోని పర్యాటకుల
ప్రధాన తీర్మానం కాగా, ఆ తర్వాత 18% మంది ప్రయాణ పరిమితుల కారణంగా
కలుసుకోలేకపోయిన తమ కుటుంబ సభ్యులు,స్నేహితులను కలుసుకునేందుకు ఇష్డపతామని తెలిపారు.

మరో 18% మంది ప్రతి కొన్ని నెలలకొకసారి కొత్త పర్యాటక ప్రాంతాలను అన్వేషించేందుకు ఇష్టపడతామని చెప్పారు. కాగా, 15% మంది ప్రయాణ ప్రయోజనాల కోసం మాత్రమే పొదుపు ఖాతాను తెరవడం ద్వారా ప్రయాణంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. ఇతర ప్రధాన తీర్మానాల్లో ఒంటరిగా ప్రయాణించడం, అన్ని వార్షిక సెలవులను ఉపయోగించడం, అంతర్జాతీయ పర్యటనలు,పర్యావరణ స్పృహతో కూడిన ప్రయాణం తదితరాలు ఉన్నాయి. సమీక్షకు స్పందించిన వారిలో 32% మంది భారతీయులు ఏడాదికి కనీసం రెండుసార్లు సెలవు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మరో 20% మంది కనీసం ఏడాదికి ఒకసారి పర్యటనలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, మరోవైపు, 22% మంది ప్రయాణికులు (నిజంగా ఉత్సుకతతో ఉన్నవారు) కనీసం నెలకు ఒకసారి వాండర్‌లస్ట్ బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారు. ఓయ్ ఆగండి. భారతీయుల్లో 6% మంది 2022లో 365 రోజులూ సెలవులో ఉండాలనుకుంటున్నారని చెప్పడం మనం మర్చిపోయామా? ఇది ఒక ప్రణాళికలా అనిపిస్తోంది!
ఐరోపా
భారతదేశం మాదిరిగానే, నెదర్లాండ్స్‌లో 80% మంది,డెన్మార్క్‌లో 51% మంది
ఐరోపాలోని పర్వత ప్రాంతాలకు ప్రయాణించారు. రెండు ప్రాంతాలలో ఓయో తన
వినియోగదారులతో నిర్వహించిన సమీక్ష ప్రకారం 2021లో,డచ్,డానిష్‌లు ఎక్కువగా
విశ్రాంతి తీసుకునేందుకు ప్రయాణించారు, ఆ తర్వాత వ్యాపారం లేదా పనికి సంబంధించిన ప్రయాణాలు చేశారు.ఐరోపా ఖండంలోని దేశాల ప్రజలు తమ సెలవులను ఇంట్లో హాయిగా గడిపేందుకు ఎంచుకున్నారని డేటా మరింత హైలైట్ చేసింది. ఆసక్తికరంగా, భారతదేశంలో మాదిరిగా కాకుండా, ఐరోపాలో సమీక్షకు స్పందించిన వారిలో 70% మంది తమ పర్యటనలను కనీసం 3 నెలల ముందుగానే ప్లాన్ చేసుకుంటామని చెప్పారు. నెదర్లాండ్స్‌లో సమీక్షకు స్పందించిన వారిలో ఎక్కువ మంది వారం రోజుల ప్రయాణ విరామం తీసుకోవడాన్ని ఇష్టపడతామని పేర్కొనగా, డానిష్ పర్యాటకులు తాము 10 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం,ఎక్కువ పర్యటనలు చేయడానికి ఇష్టపడతామని పేర్కొన్నారు.
ఆసక్తికరంగా, ఇతర దేశాల మాదిరిగా కాకుండా, ఐరోపా సోషల్ మీడియాలో ట్రావెల్ కంటెంట్‌ను డూమ్ స్క్రోలింగ్ చేసే అవకాశం లేదు,బదులుగా కుటుంబం స్నేహితుల నుంచి వారి ప్రయాణ స్ఫూర్తిని పొందుతారు.

డెన్మార్క్‌లో, ఏకాంత గ్రామీణ ప్రాంతాలు,పట్టణాలు టాప్ డెస్టినేషన్ కేంద్రాలుగా ఉండగా,నెదర్లాండ్స్‌లో సమీక్షకు స్పందించిన వారు కొండ ప్రాంతాలను ఎంచుకున్నారు. అదనంగా, దాదాపు 77% డచ్‌లు,80% డానిష్ పర్యాటకులు తమ ప్రయాణానికి ఇష్టమైన మార్గంగా రోడ్‌ట్రిప్‌లను ఎంచుకున్నారు. స్పష్టంగా చెప్పాలంటే, గత ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ కాలంగా, రెండు ప్రాంతాలకు చెందిన వారు రోడ్ ట్రిప్పింగ్‌తో కచ్చితంగా ప్రేమలో పడ్డారు. ఐరోపా దేశాలకు చెందిన వారు హోటళ్ల కన్నా వెకేషన్ హోమ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వే తేటతెల్లం చేసింది. పశ్చిమాన అందమైన ఉత్తర సముద్రం,తూర్పున బాల్టిక్ సముద్రం, డానిష్‌లో బోట్‌హౌస్‌లు రెండవ టాప్ వసతి ఎంపికగా నిలిచాయి.
పర్యటనకు సంబంధించి 2022లో ఐరోపాలొ అత్యంత ప్రజాదరణ పొందిన నూతన సంవత్సర తీర్మానం ఏమిటి?
డెన్మార్క్‌లో సమీక్షకు స్పందించిన వారిలో 33% మంది 2022లో మరింత ఎక్కువ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ప్రయాణ పరిమితులు జారీలో ఉన్నప్పుడు డెన్మార్క్ జాబితాలో రెండవ అత్యంత ప్రజాదరణ అంశంలో ప్రతి కొన్ని నెలలకు ఒకసారి కొత్త గమ్యస్థానాన్ని అన్వేషించడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులను,స్నేహితులను సందర్శించేందుకు కేటాయిస్తామని చెప్పారు. నెదర్లాండ్స్‌లో, సమీక్షకు స్పందించిన వారు రానున్న ఏడాదిలో విదేశాలకు వెళ్లాలని, సాధారణం కన్నా ఎక్కువగా ప్రయాణించాలని తీర్మానాన్ని
తీసుకున్నారు.
ఇండోనేషియా

బాలి బీచ్‌ల నుంచి జకార్తాలోని ప్రత్యక్ష వీధుల వరకు,ఇండోనేషియా సంస్కృతి, ప్రకృతి సౌందర్యానికి నిధి అని చెప్పవచ్చు. ఒయోయో ట్రావెలోపీడియా 2022లో దేశంలోని అత్యుత్తమ ప్రాధాన్యతల గమ్యస్థానంగా బాలి అగ్రస్థానంలో ఉందని వెల్లడించడంలో ఆశ్చర్యమే లేదు!సమీక్ష ఫలితాల ప్రకారం, 2021లో ఇండోనేషియన్లు ప్రయాణించడానికి లీజర్ వెకేషన్, వ్యాపార సంబంధిత ప్రయాణాలు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. సమీక్షకు స్పందించిన వారిలో
ఎక్కువ మంది రానున్న సెలవు సీజన్ కోసం తమ ప్లాన్‌లను ఇప్పటికే పూర్తి చేసుకోగా, ఇది ఇది ప్రజలలో విశ్వాసం స్థిరంగా పుంజుకుందని సూచిస్తోంది. సమీక్షకు స్పందించిన వారిలో ఎక్కువ మంది కనీసం ఒక నెల ముందుగానే తమ పర్యటనల ప్రణాళిక చేసుకునేందుకు ఇష్టపడతామని చెప్పారు. అయితే, ఇతర ప్రాంతాలతో పోలిస్తే, ఇండోనేషియా ప్రజలు తక్కువ ట్రిప్‌లనుఇష్టపడుతుండగా, సమీక్షకు స్పందించిన వారిలో 75% మంది 1 నుంచి 3 రోజుల మధ్య పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
వసతి విషయానికి వస్తే, ప్రయాణికులు తమ బసకు కీలకమైన ఎంపికగా హోటళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.అందమైన బీచ్‌లు,ద్వీపాలతో చుట్టుముట్టబడిన ఇండోనేషియన్లు తమవిహారయాత్ర లను బీచ్ డెస్టినేషన్లలో గడపాలని కోరుకున్నారు.ఇతర భౌగోళిక ప్రాంతాల మాదిరిగానే ,ఇండోనేషియా ప్రజలూ రోడ్డు మార్గంలో ప్రయాణించడాన్ని ఇష్టపడుతున్నారు. సమీక్షకు స్పందించిన వారిలో మూడవ వంతు కన్నా ఎక్కువ మంది కార్లు లేదా మోటర్‌బైక్‌లో ప్రయాణించడాన్ని ఎంచుకున్నారు.

ఇండోనేషియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నూతన సంవత్సర తీర్మానం ఏమిటి?
సమీక్షకు స్పందించిన వారిలో సుమారుగా 25% మంది కుటుంబం,ప్రియమైన వారిని కలవాలని నిర్ణయించుకోగా, ఇది ఇండోనేషియాలో 2022 ఏడాదికి అత్యంత ఎక్కువ మంది చేసిన తీర్మానంగా ఉంది. ‘ప్రయాణానికి డబ్బు ఆదా చేయడం’ అనేది రెండో స్థానంలో నిలిచింది. సమీక్షకు స్పందించిన వారిలో 15% మంది ప్రతి కొన్ని నెలలకు కొత్త గమ్యస్థానాలను అన్వేషించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.