365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: తమిళ బ్లాక్ బస్టర్ మూవీ డా..డా తెలుగులో పా.. పా.. పేరుతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట నిర్మించిన ఈ చిత్రం జనవరి 3న ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
డైరెక్టర్ మారుతి ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
గత ఏడాది తమిళంలో విడుదలైన డా..డా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గణేష్ కె బాబు తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా సుమారు ₹30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
హృదయాన్ని తాకే పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయని చిత్రబృందం తెలుపుతుంది.
తండ్రి-కొడుకుల అనుబంధంపై ఆధారంగా సాగిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు అదే ఎమోషనల్ డ్రామా తెలుగులో పా.. పా.. గా విడుదలవుతూ, తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుందని నిర్మాత నీరజ కోట తెలిపారు.
భావోద్వేగాలు, ప్రేమ, కామెడీ.. ఇవన్నీ సమపాళ్లలో కలిగిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులతో బలమైన అనుబంధం ఏర్పరుస్తుందని, బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం ఖాయమని ఆమె నమ్మకంతో చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఎంజీఎం సంస్థ ద్వారా అచ్చిబాబు విడుదల చేయనున్నారు.
ప్రొడక్షన్ హౌస్: జేకే ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: నీరజ కోట
హీరో: కవిన్
హీరోయిన్: అపర్ణ దాస్
నటీనటులు: భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి
మ్యూజిక్: జెన్ మార్టిన్
సాహిత్యం: రవివర్మ ఆకుల
పీఆర్వో: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల