ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,మచిలీపట్నం,ఏప్రిల్19, 2021:రైతు గ్రామ సరిహద్దులు దాటకుండానే పండించిన పంటను మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి ప్రస్తుతం పటిష్టమైన విధానం అమలవుతున్నదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూమచిలీపట్నం మండలంలో 26 రైతు భరోసా కేంద్రాలలో 20 ఆర్బికె లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు మిగిలిన 6 రైతుభరోసా కేంద్రాల పరిధిలో రొయ్యలు చేపల చెరువులు ఉన్నట్లు ఆయన తెలిపారు. గత సార్వ పంటలో 12 రైతుభరోసా కేంద్రాల ద్వారా 3, 449 మంది రైతులు 23, 643 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇందుకు రైతుల ఖాతాలలో 44 కోట్ల 50 లక్షల 38 వేల రూపాయలు జమ చేసిందని వివరించారు. ప్రస్తుత దాళ్వా పంట కొనుగోళ్లలో కనీస మద్దతు ధర తగ్గకుండా సాధారణ రకానికి క్వింటాలు రూ.1868 లు , అలాగే గ్రేడ్ ఎ రకంకు క్వింటాలు రూ. 1888 లు చెల్లిస్తుందని అలాగే 75 కిలోల బస్తా ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకానికి రూ. 1400 లు , గ్రేడ్ ఎ రకంకు రూ. 1416 లు రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రభుత్వం ఇస్తుందని మంత్రి చెప్పారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పేర్ని నాని
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పేర్ని నాని

దాళ్వా ధాన్యాన్నిసేకరించేందుకు రైతులకు వివిధ సేవలు అందించేందుకు ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రంలో ఒక కంప్యూటర్ ను వ్యవసాయానికి సంబంధించిన సలహాలు సూచనలు అందించేందుకు వ్యవసాయ ,రెవిన్యూ శాఖలకు చెందిన సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గతంలో మాదిరిగా రైతు ఊరూరా తిరుగుతూ ఏ రైస్ మిల్ల రు ఎక్కడ ధాన్యంకు ధర ఎక్కువ ఇస్తున్నారో తెలుసుకొని అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితులు ఈ ప్రభుత్వ హయాంలో లేవని మంత్రి తెలిపారు. రైతు నేరుగా తమ గ్రామ సచివాలయం వద్దకు వెళ్లి మా పంట కోతకు వచ్చిందని వాలంటీర్ కు ఒక మాట చెబితే చాలని వారు వెంటనే ఆ గ్రామంలోని వ్యవసాయ విస్తరణాధికారి దృష్టికి తీసుకువెళతారని వారు వెంటనే ఆ పొలానికి వెళ్లి చూసి మిల్లరుకు సమాచారం ఇస్తారని మిల్లరును లారీని రైతు పొలం గట్టు మీదకు తీసుకువచ్చి అక్కడనుంచే ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని అదేవిధంగా కొనుగోలుకు సంబంధిన సమాచారంను కంప్యూటర్లో నిక్షిప్త పర్చి రైతు భరోసా కేంద్రంలో ఆన్లైన్ చేయడం రైతు పట్టాదారు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతాను నమోదుచేసి ధాన్యం విక్రయించిన రైతుకు నేరుగా నగదు జమ చేయడంతో రైతు గ్రామ సరిహద్దులు దాటకుండానే పండించిన పంటను మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి ప్రస్తుతం పటిష్టమైన విధానం అమలవుతున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పేర్ని నాని
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పేర్ని నాని

ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా (అచ్చాబా) , వైస్ ఛైర్మెన్ తోట సత్యనారాయణ, కృష్ణాజిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు మోహనరావు, మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు, మాజీ జెడ్ పి టీ సి లంకె వెంకటేశ్వరావు, లంకా సూరిబాబు, బందెల థామస్ నోబుల్, పర్ణం సతీష్ తదితర కార్పొరేటర్లు, మార్కెట్ యార్డ్ పాలకవర్గ డైరెక్టర్లు , వ్యవసాయ విస్తరణాధికార్లు , విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్లు మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.