365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, దంబుల్లా,జనవరి 8,2026: శ్రీలంక గడ్డపై పాకిస్థాన్ బోణీ కొట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న పాక్.. దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకను కట్టడి చేసి సునాయాస విజయాన్ని అందుకుంది.

కూలిన లంక కోట..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. శ్రీలంక బ్యాటర్లు ఆది నుంచే తడబడ్డారు. పాక్ బౌలర్ల ధాటికి లంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

శ్రీలంక స్కోరు: 128 ఆలౌట్ (19.2 ఓవర్లలో)

ముఖ్య బ్యాటర్లు: జనిత్ లియనగే (40) పోరాడగా, వనిందు హసరంగ (18), కుశాల్ మెండిస్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

పాక్ బౌలింగ్: అబ్రార్ అహ్మద్ (3/25), సల్మాన్ మీర్జా (3/18) ప్రత్యర్థి నడ్డి విరవగా.. షాదాబ్ ఖాన్ 2 వికెట్లతో మెరిశాడు.

పాక్ లక్ష్య ఛేదన.. సులభంగా!
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

సాహిబ్‌జాదా ఫర్హాన్: 51 పరుగులు (36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి:హైదరాబాద్‌లో దక్షిణాదిలోనే మొట్టమొదటి ‘ఫిన్నిష్’ స్కూల్ ప్రారంభం..

Read this also:New Finnish-Model International School Debuts in Hyderabad..

షాదాబ్ ఖాన్: చివర్లో అజేయంగా 18* పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

పాక్ స్కోరు..129/4 (16.4 ఓవర్లలో

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాదాబ్ ఖాన్

బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ రాణించిన షాదాబ్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

సంక్షిప్త స్కోర్లు..
శ్రీలంక: 128 (19.2 ఓవర్లు) – లియనగే 40; అబ్రార్ 3/25, మీర్జా 3/18. పాకిస్థాన్: 129/4 (16.4 ఓవర్లు) – ఫర్హాన్ 51, అయూబ్ 24; హసరంగ 1/17.

Read this also:Ultra-Luxury Surge: Lexus India Reports Strong Growth for LX and LM Flagships in 2025..

ఇదీ చదవండి:శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నియామకం..!

తదుపరి మ్యాచ్..ఈ విజయంతో పాక్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ శుక్రవారం (జనవరి 9న) ఇదే వేదికపై జరగనుంది.