Thu. Nov 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 23, 2023:పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో టెక్ మహీంద్ర, ఆగర్ సైబ్రిక్స్ ,మాగ్నాక్ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన 47 మంది విద్యార్థులు:

పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రా శనివారాలలో జరిగిన సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగాలకు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఎంపిక కావడంపై కళాశాల చైర్మన్ మల్కా కొమరయ్య,డైరెక్టర్ మల్కా నవీన్ కుమార్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.బి .రాజు మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ ఎం.రాజేందర్ రెడ్డి గార్లు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా కంపెనీ నుండి వచ్చినటువంటి హెచ్ఆర్ మేనేజర్లు విద్యార్థు లకు ఆన్లైన్, వ్రాత పరీక్ష , గ్రూప్ డిస్కషన్, మౌఖిక పరీక్షలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన 47 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఈ కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు.

మ్యాగ్నెట్ సాఫ్ట్వేర్ లో 9 మంది విద్యార్థులు 2.4 లక్షలు, అగర్ సైబ్రిక్స్ కంపెనీలో 10 మంది విద్యార్థులు 4.5 లక్షల నుంచి 6 లక్షలు మరియు టెక్ మహేంద్ర కంపెనీలో 2.4 లక్షల వార్షిక వేతనాలతో 27 మంది విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ లో ఎంపికయ్యారు.

నాలుగవ సంవత్సరం మొదటి సెమిస్టర్ లోనే ఉద్యోగాలకు ఎంపిక ఇవ్వడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎం. బి .రాజు గారు ప్లేస్మెంట్ డైరెక్టర్ ఆర్కే. సుమీద గారు మాట్లాడుతూ ఇంకా అనేక కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ లో ఇంకా ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరుగుతాయని విద్యార్థులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు కళాశాల , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏ .శ్రీధర్ గారు హెచ్. ఓ .డి లు ,ఇతర అధ్యాపకులు విద్యార్థులు అభినందనలు తెలిపారు.

error: Content is protected !!