Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగష్టు 13,2023: బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్.. ఎడిస్టీస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంతో, సైబర్ భద్రత, భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయంపై అవగాహన పెంచాలని అనుకుంది.

అదే లక్ష్యంతో ‘పల్లవి స్ట్రిడెథాన్’ 5K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 2023, ఆగస్ట్ 12న కార్యక్రమం అందరినీ ఆకర్షించింది. సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కల్పించడంలో సఫలీకృతం అయిందని స్కూల్ యాజమాన్యం పేర్కొంది.

స్ట్రిడెథాన్ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన రమేష్ మాట్లాడుతూ, సైబర్ భద్రత ఆవశ్యకత గురించి వివరించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్అండ్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీఓఓ మల్కా యశస్వి మాట్లాడుతూ.. విద్యార్థులకు సైబర్ భద్రత గురించి బోధించడం ఎంత కీలకమో వివరించారు.

విద్యారంగంలో నాయకత్వాన్ని బాధ్యతగా తీసుకున్న ఆయన ఎల్లప్పుడూ క్లాస్ రూముల్లోని పిల్లల భద్రత గురించి ఆలోచిస్తారు. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైనమిక్ డైరెక్టర్ సుశీల్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై, సైబర్ క్రైమ్ గురించి యువకులకు అవగాహన కల్పించడం , దానిని ఎలా అరికట్టాలన్న విషయాన్ని నొక్కి చెప్పారు.

పాఠశాల విద్యార్థులకు విద్యాబోధన కోసం పనిచేసే ఎడిస్టీస్ ఫౌండేషన్ అనే సంస్థతో పాఠశాల అనుబంధంగా ఉందని కూడా ఆయన ప్రకటించారు. సైబర్ సేఫ్టీపై మోడల్ కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టామని, అక్కడ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సైబర్ స్కౌట్‌లుగా ప్రకటిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సైబర్ భద్రత గురించి తోటి విద్యార్థులకు మరియు సమాజానికి అవగాహన కల్పించే బాధ్యతను పాఠశాల సైబర్ స్కౌట్‌లు తీసుకుంటారని ఆమె తెలిపారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు,సిబ్బందితో కలిపి మొత్తం 1200 మందికి పైగా ఈ 5కే వాక్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వారంతా కలిసి కవాతు చేస్తున్నప్పుడు ఉత్తేజిత స్వరాలు నినాదాలతో ప్రతిధ్వనించాయి. అలా ఆకట్టుకునే ఆలోచింపజేసే నినాదాలు అన్నీ ఇంటర్నెట్ భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి తోడ్పడ్డాయి.

ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో భాగస్వామి అయిన డెకాథ్లాన్‌తో కలిసి పనిచేయడం ఈవెంట్ సుసంపన్నమైన అంశం. అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు డెకాథ్లాన్ నుంచి ఒక పతకాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ (బాచుపల్లి), స్పాన్సర్స్ ఎడిస్టీలు, సైబర్ స్కూల్, డెకాథ్లాన్, ఫ్యాబ్ ఫుడ్, ఎస్‌ఎల్‌జి హాస్పిటల్స్ , సహకారులు తరుణి, భరత్ ఫౌండేషన్, లీడ్ లైఫ్ ఫౌండేషన్, సిరి మువ్వా ఆర్ట్స్, యునిసెఫ్, సేవ్ ది చైల్డ్, హెచ్ సీ జీ, యూత్ ఫర్ సేవ, మై చాయిసస్, నియోపిక్స్ ల సమిష్టి కృషి ఉంది. డిజిటల్ యుగం, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయి.

error: Content is protected !!