365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి13,2025: సమయం, వ్యయ ప్రయాసలకు ఫుల్ స్టాప్: ప్రతినెల రెండో, నాలుగో శుక్రవారాల్లో ఆన్లైన్ మీటింగ్.. ప్రతినెల రెండవ ,నాలుగవ శుక్రవారాల్లో ఉద్యోగుల సమస్యలపై ఆన్లైన్ సమావేశం నిర్వహించడానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఈ సమావేశాలు ఉదయం 3 నుంచి 4 గంటల వరకు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఈ విధానం ద్వారా ఉద్యోగులు తమ సమస్యలను సచివాలయం చుట్టూ తిరగకుండా ఆన్లైన్ ద్వారా ఉన్నతాధికారులకు పరిచయం చేసుకోవచ్చు. ఈ సమావేశాల్లో పంచాయతీరాజ్ శాఖ హెడ్ ఆఫీసు స్థాయిలో పెండింగ్ ఫైల్స్, సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తారు.

24 తేదీన తొలి సమావేశం
ఈ నెల నాలుగో శుక్రవారం, 24 తేదీన తొలిసారి ఈ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, SERP CEO దివ్య దేవరాజన్, PRRD డైరెక్టర్ సృజన, మిషన్ భగీరథ, రూరల్ ఇంజనీరింగ్ ENC లు పాల్గొంటారు.
సత్వర పరిష్కారం
ఈ విధానంలో ఉద్యోగులు తమ సమస్యలను, పత్రాలను వెబ్ లింక్ ద్వారా, వాట్సాప్ లేదా మెయిల్ ఐడీ ద్వారా సమర్పించవచ్చు. ఈ విధానం ద్వారా సమయం, శ్రమ, వ్యయం ఆదా అవుతుంది.
మంత్రి సీతక్క..
“గ్రామీణ ఉద్యోగులు తమ సమస్యలను, సర్వీస్ అంశాలను హైదరాబాదు రాకుండా ఆన్లైన్‌లోనే పరిష్కరించుకోవచ్చు. ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాలన మరింత వేగంగా జరుగుతుంది,” అని మంత్రి సీతక్క అన్నారు.