365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కర్నూలు, 20 డిసెంబర్ 2021 : ప్రపంచ ప్రసిద్ధ బిర్యానీ ప్యారడైజ్, తమ 45వ ఔట్‌లెట్‌ను కర్నూలులో ఏర్పాటుచేసింది. ఈ నూతన ఔట్‌లెట్‌ను వ్యూహాత్మకంగా హైదరాబాద్ నగరానికి సమీపంలో, రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటుచేయడం ద్వారా ఖచ్చితమైన వీకెండ్ గేట్‌వేలుగా మలుస్తుంది. ఈ సారి, స్థానిక పర్యాటక ప్రాంతాలతో పాటుగా ఎక్కువ మంది రుచి చూడటానికి ఇష్టపడే ప్యారడైజ్ బిర్యానీ అత్యున్నత భోజన కేంద్రంగా కూడా నిలుస్తుంది.
చారిత్రకంగా అత్యంత ప్రాచుర్యం పొందిన కొండారెడ్డి బురుజు,కేతవరం చిత్రాలు మొదలు గొల్గుంబ్జ్ (అబ్దుల్ వాహబ్ సమాధి) వంటివి కర్నూలు జిల్లాలోల అత్యంత ప్రాచుర్యం పొందినవి. ఇప్పుడు కర్నూలు పట్టణంలో ప్యారడైజ్ రెస్టారెంట్ తెరువడంతో కర్నూలు వారసత్వంను హైదరాబాద్ ఫుడ్ ఐకాన్‌ను ఒకే చోటకు తీసుకురావడం జరుగుతుంది.
అతిథులు అత్యుత్తమ బిర్యానీ, కబాబ్,మరెన్నో అంశాలను ఒకే చోట అత్యున్నత నాణ్యత, అసాధారణ పరిశుభ్రత,జాగ్రత్తతతో ప్రస్తుత కోవిడ్–19 కాలంలో అవసరమైన మార్గదర్శకాలన్నీ అనుసరిస్తూ అందిస్తుంది. భాగ్యనగర్‌లో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విలాసవంతమైన రెస్టారెంట్ ఉంది. కర్నూలులోని ఆహారాభిమానులు ,చుట్టు పక్కల ప్రాంతాల వాసులు ప్యారడైజ్ రుచులు, దాని ప్రతిష్టాత్మక బిర్యానీలు, కబాబ్‌లు, డెస్సర్ట్స్‌తో తమ జిహ్వచాపల్యంను సంతృప్తి పరుచుకోవచ్చు.
ఈ నూతన రెస్టారెంట్ ఆవిష్కరణ గురించి అలీ హేమతి, ఛైర్మన్– ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ విద్యార్థులతో పాటుగా వ్యాపారవేత్తలకు సైతం అత్యంత ప్రాచుర్యం పొందినది కర్నూలు. కర్నూలులోని మా నూతన ఔట్‌లెట్ మా రెస్టారెంట్ చైన్‌లో 45వదిగా నిలుస్తుంది. కర్నూలులో అత్యుత్తమ వీకెండ్ గేట్‌వేలను కోరుకునే వారికి మహోన్నత కారణమూ ఇది అందిస్తుంది. ఈ నగరంలో దాదాపు నాలుగు లక్షల మందికి ప్రజలు నివశిస్తుండటం వల్ల ఇది ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. కర్నూలు నగరానికి రోజూ వచ్చిపోయేవారు లక్షల సంఖ్యలో ఉంటుంటారు. వీరంతా కూడా అత్యంత నాణ్యతమైన, రుచికరమైన ఆహారాన్ని తమ ప్రయాణ విడిదిలో కావాలనుకుంటుంటారు. అందువల్ల, కర్నూలు మాకు అత్యుత్తమ ప్రాధాన్యతా కేంద్రంగా నిలుస్తుంది. అంతేకాదు, మహోన్నత వారసత్వం, పసందైన విందు ఖచ్చితమైన సమ్మేళనంగానూ ఇది నిలుస్తుంది. ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ బిర్యానీని అందించాలనే ప్రయత్నంలో కర్నూలులో మా రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకురావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.
‘‘ కర్నూలులో మా నూతన ఔట్‌లెట్ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిర్యానీని ఇక్కడకు తీసుకురావడం ద్వారా మేము దశాబ్దాల ప్యారడైజ్ వారసత్వంను వేడుక చేయడంతో పాటుగా కర్నూలులోని చారిత్రక వైభవాన్నీ వేడుక చేస్తున్నాము. కర్నూలు,హైదరాబాద్‌లు రెండూ కూడా నవాబీ సంస్కృతిని కలిగి ఉన్నాయి. సందర్శకులతో పాటుగా పర్యాటకులు సైతం ఇక్కడి విందు ఆస్వాదిస్తూ అద్వితీయ జ్ఞాపకాలను తమ వెంట తీసుకువెళ్లగలరు’’అని డాక్టర్ కజీమ్ హేమతి, డైరెక్టర్– ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు
గౌతమ్ గుప్తా, సీఈవో– ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ మా కీర్తి కిరీటంలో కలికితురాయిగా మా 45 వ రెస్టారెంట్‌ను కర్నూలులో ప్రారంభించాము. భారతదేశంతో పాటుగా విదేశాలలో సైతం ఖచ్చితంగా సందర్శించాల్సిన అత్యున్నత ఆహార కేంద్రాలలో ఒకటిగా,మా విస్తరణ ప్రణాళికలలో భాగంగా కర్నూలు నూతన సందర్శకులను ఆకర్షించేందుకు అత్యుత్తమ కేంద్రంగా నిలిచింది. నూతన ,పాత వినియోగదారులకు సేవలనందించనుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. ప్యారడైజ్ వారసత్వంను మేము కొనసాగించనున్నాము’’అని అన్నారు.
ఈ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్ చేసిన రెస్టారెంట్ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్ కాంగ్రెస్ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా,గోల్డెన్ స్పూన్ అవార్డు ను ఇండియా ఫుడ్ ఫోరమ్ వద్ద 2018లో అందుకుంది.తెలంగాణా స్టేట్ హోటల్స్ అసోసియేషన్స్,జీహెచ్‌ఎంసీ ,టైమ్స్ ఫుడ్ అవార్డ్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణా, లైఫ్‌టైమ్ అావ్‌మెంట్ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది.