Wed. Jan 15th, 2025

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 21, 2022: ప్యారడైజ్‌ తమ నూతన ఔట్‌లెట్‌ను తెరువడంతో నూతన సంవత్సరంలో తన  తొలి బహుమతిని  మల్కాజ్‌గిరి అందుకుంది.  మౌలా అలీ పవిత్ర సమాధి కి అత్యంత ప్రాచుర్యం పొందిన మల్కాజ్‌గిరి ప్రాంతం అన్ని మత పరమైన నమ్మకాలు కలిగిన వ్యక్తులను సైతం ఆకర్షిస్తుంటుంది. ఈ ప్రాంతానికి సంవత్సరమంతా భక్తులు వస్తూనే ఉంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులకు ఇప్పుడు తెరుచుకున్న ప్యారడైజ్‌ ఔట్‌లెట్‌ ఖచ్చితంగా నిలువకలిగిన కేంద్రంగా నిలుస్తూనే  అత్యున్నత నాణ్యత కలిగిన ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో అందిస్తుంది.

ప్రతి ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ ప్రారంభంతో,  వారు తమ ప్రమాణాలు మరియు అత్యున్నత నాణ్యతను  నిర్వహిస్తున్నామనే భరోసాను అందిస్తున్నారు. మహమ్మారి కాలంలో నాణ్యత నియంత్రణ ప్రమాణాలు అనుసరించడంతో పాటుగా  ప్రామాణిక మార్గదర్శకాలనూ అనుసరిస్తున్నారు. సందర్శకులు ఇప్పుడు తమ జిహ్వచాపల్యంను తీర్చుకుంటూ  అత్యుత్తమ బిర్యానీ, కబాబ్‌ మరియు మరెన్నో అంశాలను రుచి చూడవచ్చు. వీటన్నిటినీ వినియోగదారులకు అత్యుత్తమ పరిశుభ్రత మరియు సంరక్షణతో అందిస్తున్నారు. ప్రస్తుత సమయంలో అన్ని చోట్లా అత్యుత్తమంగా అవసరమైన వేళ ఇక్కడ వడ్డించే ఆహారం కూడా అదే స్ధాయి భద్రతను కలిగి ఉంటుంది. మల్కాజ్‌గిరి వద్ద ఉన్న ఈ రెస్టారెంట్‌ ఇప్పుడు  ప్రతిష్టాత్మక బిర్యానీలు, కబాబ్‌లు, డెసర్ట్స్‌తో పాటుగా ప్యారడైజ్‌ రుచులను తమ రుచులకనుగుణంగా ఆస్వాదించే అవకాశం అందిస్తుంది.


ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అలీ హేమతి, మాట్లాడుతూ  ‘‘ సికింద్రాబాద్‌లో  మా మరో ఔట్‌లెట్‌ను ఆవిష్కరించడమన్నది మాకు అద్వితీయమైన ఆనందాన్ని అందించింది. ఎందుకంటే ఇదే సమయంలో మేము మరో ఔట్‌లెట్‌ను వనస్థలిపురం వద్ద తెరిచాము. ఇది 2022 సంవత్సరాన్ని మాకు అద్భుతమైన ఆరంభంగా నిలిపింది. ఏలూరు, విజయనగరం, కర్నూలు, వరంగల్‌లో ఇటీవలి కాలంలో  మా రెస్టారెంట్లను  ప్రారంభించిన తరువాత హైదరాబాద్‌ నగరంలో మల్కాజ్‌గిరి వద్దఈ రెస్టారెంట్‌ ప్రారంభం మాకు ఇంటికి తిరిగి వచ్చినట్లుగా ఉంది.  తెలుగు రాష్ట్రాలలో ఇది మాకు 49వ ఔట్‌లెట్‌. ట్రేడ్‌ మార్క్‌ ప్యారడైజ్‌ బిర్యానీకి   ఉన్న ఆదరణ ఇది చూపుతుంది. అంతేకాదు, ఈ ప్రారంభం అనేది నూతన సంవత్సర సీజన్‌ ఆరంభంతో పాటుగా జరుగడంతో ఇది పండుగ స్ఫూర్తినీ అందిస్తుంది’’ అని అన్నారు.

ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కజీమ్‌ మాట్లాడుతూ ‘‘ తెలుగు రాష్ట్రాలలో ఇది మా 49వ ఔట్‌లెట్‌.  మల్కాజ్‌గిరి వద్ద ఈ నూతన ప్రారంభం అనేది వనస్థలిపురం వద్ద తెరుచుకున్న మా రెస్టారెంట్‌తో పాటుగా జరిగింది. తద్వారా హైదరాబాద్‌ నగరంలో ప్రతి మూలా ప్యారడైజ్‌ బిర్యానీ అభిమానులు ఉన్నారనే వాస్తవాన్ని పునరుద్ఘాటిస్తున్నాము. దశాబ్దాలుగా నాణ్యమైన మా ఆహారాన్ని నగరవాసులకు అందించడంతో పాటుగా ప్రతి సారీ దానిని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం పట్ల సంతోషంగా ఉన్నాము. ప్యారడైజ్‌ వారసత్వం నిలిపి ఉంచడంలో మా సిబ్బంది, నాయకత్వ బృందం మాకెంతగానో తోడ్పడింది’’ అని అన్నారు.

ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో గౌతమ్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ మా ట్రేడ్‌మార్క్‌ ఔట్‌లెట్‌ను తెరువడమనేది మా విస్తరణ ప్రణాళికలో భాగం. కేవలం రోజుల వ్యవధిలోనే మేము రెండు రెస్టారెంట్లను తెరిచాము. ఒకటి మల్కాజ్‌గిరి వద్ద ఉంటే, మరోటి వనస్థలిపురం వద్ద ఉంది. ఈ ప్రాంతం, చుట్టుపక్కల వాసులు అత్యద్భుతమైనరుచులతో విందు చేసుకోవచ్చు’’ అని అన్నారు.

ఈ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్‌ చేసిన రెస్టారెంట్‌ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్‌ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ లో  అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా మరియు గోల్డెన్‌ స్పూన్‌ అవార్డు ను ఇండియా ఫుడ్‌ ఫోరమ్‌ వద్ద 2018లో అందుకుంది.   తెలంగాణా స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్స్‌,  జీహెచ్‌ఎంసీ, టైమ్స్‌ ఫుడ్‌ అవార్డ్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా, లైఫ్‌టైమ్‌ అావ్‌మెంట్‌ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది.

error: Content is protected !!