Tue. Dec 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 6,2022 : తమ మరో నూతన రెస్టారెంట్‌ను వనస్థలిపురంలో ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్‌ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. షికార్‌ఘర్‌గా ఒకప్పుడు వేటకు అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ అటవీప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. ఈ కారణం చేతనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. వనస్థలిపురం ఇప్పుడు డీర్‌ పార్క్‌ ఉన్న ప్రదేశంగా అత్యంత ప్రసిద్ధి. మహావీర్‌ హరిణ వనస్థలిగా పేరొందిన ఈ పార్క్‌కు వారాంతాలలో అధిక సంఖ్యలో చిన్నారులు వస్తుంటారు. ఈ నూతన ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ను వనస్థలిపురం వద్ద ప్రారంభించడం వల్ల చిన్నారులతో పాటుగా పెద్దలు సైతం ఒకేలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిర్యానీతో విందును చేసుకోవచ్చు. నూతన సంవత్సర సంబరాలు ఇంకా జరుగుతున్న వేళ, వనస్థలిపురంలో ఈ నూతన ప్యారడైజ్‌ ఔట్‌లెట్‌ ప్రారంభించడంతో రెట్టింపు ఆనందాన్ని ప్రజలు పొందగలరు.

ప్రతి ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ ప్రారంభంతో వారు తమ ప్రమాణాలు, అత్యున్నత నాణ్యతను నిర్వహిస్తున్నామనే భరోసాను అందిస్తున్నారు. సందర్శకులు ఇప్పుడు తమ జిహ్వచాపల్యంను తీర్చుకుంటూ అత్యుత్తమ బిర్యానీ, కబాబ్‌, మరెన్నో అంశాలను రుచి చూడవచ్చు. వీటన్నిటినీ వినియోగదారులకు అత్యుత్తమ పరిశుభ్రత,సంరక్షణతో అందిస్తున్నారు. ప్రస్తుత సమయంలో అన్ని చోట్లా అత్యుత్తమంగా అవసరమైన వేళ ఇక్కడ వడ్డించే ఆహారం కూడా అదే స్ధాయి భద్రతను కలిగి ఉంటుంది. వనస్ధలిపురం వద్ద1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రెస్టారెంట్‌ ఉంది. వనస్థలిపురంలోని ఆహారాభిమానులు మరియు దగ్గరలోని ప్రాంతాలు ఇప్పుడు ప్రతిష్టాత్మక బిర్యానీలు, కబాబ్‌లు, డెసర్ట్స్‌తో పాటుగా ప్యారడైజ్‌ రుచులను తమ రుచులకనుగుణంగా ఆస్వాదించవచ్చు.

ఈ సందర్భంగా ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అలీహేమతి మాట్లాడుతూ ‘‘ఈ నూతన సంవత్సరాన్ని మా మరో రెస్టారెంట్‌ ప్రారంభంతో మొదలుపెట్టడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సారి మరోమారు హైదరాబాద్‌లోని వనస్థలి పురం వద్ద ఈ రెస్టారెంట్‌ ప్రారంభించాము. ఏలూరు, విజయనగరం, కర్నూలు, వరంగల్‌ తరువాత ఈ ప్రారంభం జరిగింది. ఇది మా 47వ ఔట్‌లెట్‌. ట్రేడ్‌మార్క్‌ ప్యారడైజ్‌ బిర్యానీకి ఉన్న డిమాండ్‌కు ఇది ప్రతి రూపం. అంతేకాదు, ఈ నూతన రెస్టారెంట్‌ ప్రారంభం, నూతన సంవత్సర సీజన్‌తో పాటుగా జరుగడంతో పండుగ వాతావరణమూ కనిపిస్తుంది’’ అని అన్నారు.

ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కజీమ్‌ మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌లో ఇది మా 47వ ఔట్‌లెట్‌. ఈసారి వనస్థలిపురంలో మా నూతన ఔట్‌లెట్‌ ప్రారంభించాం. నగరంలో ప్రతి మూలా ప్యారడైజ్‌ బిర్యానీకి ఉన్న ఆదరణకు ఇది ప్రతిరూపం. దశాబ్దాలుగా మా అత్యంత నాణ్యమైన ఆహారాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం, ప్రతిసారీ మహోన్నతమైన అనుభవాలనూ అందిస్తున్నాము. ప్యారడైజ్‌ వారసత్వంను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో మా నాయకత్వ, సిబ్బంది అంకితభావం ఎంతగానో తోడ్పడింది’’ అని అన్నారు.

ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో గౌతమ్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘వనస్థలిపురంలో జింకల పార్క్‌ను గేట్‌వేగా ప్రజలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇప్పుడు తమ దగ్గరలోని నూతన ఔట్‌లెట్‌ వద్ద తమ అభిమాన క్యుసిన్‌ ఆస్వాదించడం ద్వారా ద్వంద్వ ప్రయోజనాలు వారు పొందవచ్చు. క్రిస్‌మస్‌, నూతన సంవత్సర వేడుకలతో సమానంగా ఈ ఆవిష్కరణ జరగడంతో ఈ నూతన ఔట్‌లెట్‌ ప్రారంభం మరింత వేడుకగా మారింది’’ అని అన్నారు.

ఈ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్‌ చేసిన రెస్టారెంట్‌ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్‌ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా,గోల్డెన్‌ స్పూన్‌ అవార్డు ను ఇండియా ఫుడ్‌ ఫోరమ్‌ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్స్‌, జీహెచ్‌ఎంసీ, టైమ్స్‌ ఫుడ్‌ అవార్డ్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా, లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది.

error: Content is protected !!