365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 6,2024: WeXL, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మధ్య చిరస్థాయిగా నిలిచే ముఖ్యమైన భాగస్వామ్యం కుదిరింది. ఈ విషయాన్ని ప్రకటించేందుకు మేమెంతో సంతోషిస్తున్నాం.ఇది హైదరాబాద్‌లోని మా ప్రతిష్టాత్మక సంస్థలో భాగంగా ఉన్న అన్ని బ్రాంచెస్ లో విద్యను విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ఏర్పడింది.
మార్చి 6, 2024న జరిగిని ఈ లాంచ్ ఈవెంట్లో డీపీఎస్ గ్రూప్ చైర్మన్ మల్కా కొమరయ్య, WeXL సీఈఓ నవీన్ కుమార్ ,WeXL సీఓఓ కిరణ్ ఆత్మకూరు పాల్గొన్నారు. అలాగే వారితోపాటు ఎంతోమంది గౌరవనీయులైన ప్రముఖులు, ముఖ్య వాటాదారులు హాజరయ్యారు.
ఈ భాగస్వామ్యం విద్య,కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ పట్ల మా అంకితభావాన్ని తెలియజేస్తోంది. అంతేకాకుండా విద్యార్థుల అభ్యాస అవకాశాలను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
1994లో స్థాపించబడిన పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్.. విద్య, వ్యక్తిగతంగా ఉన్నతంగా రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాయి. సామాజిక బాధ్యతగల ప్రపంచ నాయకులను సృష్టించే దృక్పథంతో ఈ సంస్థ ఎప్పుడూ అకాడమిక్ ఎక్సలెన్స్‌ని కొనసాగిస్తూనే ఉంది. మా విద్యా సంస్థల సంచలనాత్మక ఆవిష్కరణలు క్లాసులో సగటున కనీసం 50శాతం మెరుగుదలకు ఎప్పుడూ హామీ ఇస్తాయి. అదే సమయంలో ఫ్యాకల్టీ పనిభారాన్ని తగ్గించి, ఉత్పాదకతను పెంచుతాయి. https://pallavimodelschools.org/
WeXL Edu Pvt Ltd. అనే సంస్థ అకాడమిక్ ఎక్సలెన్స్ సొల్యూషన్స్‌లో ప్రముఖ ప్రొవైడర్ గా గుర్తింపు పొందింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు వినూత్న విద్యా పరిష్కారాలను అందిస్తోంది.
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రచురణకర్తలు ,ఎడ్‌టెక్ కంపెనీలతో సహా ప్రపంచవ్యాప్తంగా 5000 భాగస్వామ్యాలతో, WeXL ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల కోసం అసమానమైన నాణ్యతతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తోంది. WeXL సంస్థ రెండు వినూత్న డిజిటల్ ఉత్పత్తులను తీసుకొచ్చింది.
(అకాడమిక్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్, మైక్రో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్) + ఒక ఆఫ్‌లైన్ అకాడమిక్ ఎక్సలెన్స్ ప్రోడక్ట్ (మొబైల్/డెస్క్‌టాప్ లేకుండా) అనేవి ఏదైనా ఇన్‌స్టిట్యూట్ (అవి పాఠశాలలు లేదా కళాశాలలు కావచ్చు) విజయం కోసం తోడ్పడతాయి. www.wexledu.com