
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, కడప, జూన్ 19, 2022: పసుపులేటి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం కడపలో జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్ర,తెలంగాణ కర్ణాటక నుంచి పసుపులేటి వంశస్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు పసుపులేటి వీర ప్రదీప్, తిరుమల packers and movers అధినేత పసుపులేటి వెంకట కృష్ణా ప్రసాద్, పసుపులేటి సుబ్బారాయుడు వచ్చారు.



పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కులమతాలకు అతీతంగా అందరికీ సేవ చేస్తామని ట్రస్ట్ అధ్యక్షుడు పసుపులేటి ప్రసాద్ తెలిపారు. అలాగే ఈ కార్య క్రమంలో ట్రస్ట్ మెంబెర్స్ పసుపులేటి శ్రీనివాసులు, విశ్వనాథ, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.