
PAVITHROTSAVAM CONCLUDES IN SRI KRT
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, ఆగస్టు 6,2021:తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి.కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఆలయంలో ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు.

PAVITHROTSAVAM CONCLUDES IN SRI KRT
ఈ సందర్భంగా శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు.రాత్రి యాగశాలలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

PAVITHROTSAVAM CONCLUDES IN SRI KRT