365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జులై 11,2022: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన సోమవారం వేడుకగా గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు యాగశాల పూజ, హోమం, లఘు పూర్ణాహుతి, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు యాగశాలపూజ, హోమం, పట్టు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.