pavotrotsavams

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,జూలై10, 2022: శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలు ఆదివారం ప్రారంభ‌మ‌య్యాయి. కార్యక్రమంలో భాగంగా ఉద‌యం 9 నుంచి10 గంట‌ల వ‌ర‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, గంధం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం చేప‌ట్టారు. ‌సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

pavotrotsavams

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డిప్యూటీ ఈవోదేవేంద్ర‌బాబు, సూప‌రింటెండెంట్లు భూప‌తి,శ్రీ‌నివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ రెడ్డిశేఖ‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.