
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,జూలై10, 2022: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జులై 10 నుంచి12వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6నుంచి రాత్రి 8గంటల వరకు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.

జులై 10న పవిత్ర ప్రతిష్ఠ, జులై 11న గ్రంథి పవిత్ర సమర్పణ, జులై 12న మహాపూర్ణా హుతి నిర్వహిస్తారు. చివరిరోజు సాయంత్రం 6గంటలకు పంచమూర్తులైన శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారు, శ్రీవిఘ్నేశ్వ రస్వామి, శ్రీసుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.