365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సోమాజిగూడ ,సెప్టెంబర్ 28,2021: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రెస్ క్లబ్‌లో పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్ నిర్వహించి పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. పోసాని ప్రెస్‌మీట్ కొనసాగుతుండగానే పవన్ అభిమానులు ప్రెస్‌క్లబ్ వద్దకు భారీగా చేరుకున్నారు. పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ప్రెస్ క్లబ్ వద్ద భారీగా మోహరించారు. పలువురు పవన్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ జనసేన యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దీంతో ఆయనతో పాటు పలువురిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరికునేది లేదని లక్ష్మణ్ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ సైకో కాదని, పోసానినే సైకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.