365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 3, 2022:మీకు మీరే రోల్ మోడల్ కావాలని జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సి.ఎ. స్టూడెంట్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మీకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధిపథంలో దూసుకుపోవాలని..జీవితంలో తమకు తామే ఆదర్శప్రాయులుగా ఎదగాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సీఏ విద్యార్థులకు సూచించారు.
అపజయాలను, విజయాలను సమానంగా తీసుకోవాలని…అపజయం ఎదురైందంటే సగం విజయం సాధించినట్టేనని గుర్తుపెట్టుకోవాలని ఆయన చెప్పారు. అపజయంలోనే జయం దాగి ఉందన్నారు.
ధనార్జనే ధ్యేయంగా కాకుండా అందరికీ గుర్తుండిపోయే జీవితాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సి.ఎ. స్టూడెంట్స్ నిర్వహించారు.
శనివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేనాని పావనకల్యాణ్ హాజరయ్యారు. “భారతదేశ సమగ్రాభివృద్ధికి చార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర కీలకమని మీ విజయాలు జాతి పురోభివృద్ధికి దోహదం చేస్తాయి. మోతీలాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చైర్మన్ అండ్ మేనిజింగ్ డైరెక్టర్ మోతీలాల్ ఓశ్వాల్ మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను”అని పవన్ పేర్కొన్నారు.
ఒక తెలివితేటలుగల వ్వక్తి ముందుగా చేసే పని.. ఒక తెలివితక్కువ మనిషి చివరిగా చేస్తాడు. తెలివితేటలు కలిగిన వ్యక్తి భవిష్యత్తును ముందే ఊహించే శక్తికలిగి ఉంటాడు అంటారు. ఎప్పటినుంచో నాలో ఒక సందేహం ఉండేది..ఎందుకు కొద్దిమంది మాత్రమే విజయాలను అందుకొంటున్నారు. మిగతా వారు ఎందుకు సాధించలేకపోతున్నారు” అని జనసేనాని అన్నారు.