Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్ ,సెప్టెంబర్26, 2021: సాయి ధరమ్ తేజ్ సినిమా ఫంక్షన్ కి ఎప్పుడు రాలేదు. వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడాలి. నేను కూడా అలాగే ఏ సినిమా వస్తే ఆ సినిమా చేస్తూ వచ్చాను.. నేను మీ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను.. రిపబ్లిక్ సినిమా బాగా ఆడాలి.. చాలా మంది తేజ్ కోలుకోవాలని కోరుకున్నారు

 pawan_365telugu
pawan_365telugu

నేను కొన్ని స్టొరీ లు చూసాను.
ఇసుక తో స్కిడ్ అయిన విషయానికి కూడా ఆ యాక్సిడెంట్స్ మీద కథనాలు అల్లి ఏదేదో రాసారు అలాంటివి మీకు రావని గ్యారెంటీ ఏంటి..? ఒక భగత్ సింగ్ గానీ చంద్రశేఖర్ ఆజాద్ గానీ గాంధీజీ గానీ ఎంతో మంది త్యాగాలు చేస్తే గానీ మనకు స్వాతంత్య్రం వచ్చింది. రాను రాను పాలిటిక్స్ లో దిగజారుడు తనం వచ్చింది. సినిమాల్లో మాట్లాడటం ఒకటి అయితే నిజమైన జీవితంలో దానిని మాట్లాడటం చాలా కష్టం. తేజ్ యాక్సిడెంట్ మీదకాదు… మీరు మాట్లాడాల్సింది..
వైఎస్ వివేకానంద ఎలా హత్యకు గురయ్యారు అనేది మీద రాయాలి. కోడి కత్తి మీద, ఆరేళ్ల చిన్నారి హత్యాయత్నం మీద మాట్లాడాలి. కాపు రిజర్వషన్స్ గురించి, బోయ కులస్తుల గురించి రాయండి. ఇడుపుల పాయ గురించి మాట్లాడండి. ఇవి రాస్తే వాళ్ళు ఇంటికొచ్చి కొడతారు. పొలిటికల్ క్రైమ్ గురించి రాయండి

ఆంధ్రాలో సినిమా హళ్లే లేవు..
చిత్ర పరిశ్రమ లో వాళ్ళు కోట్లు కోట్లు తీసుకున్నారు అంటున్నారు.. ఒరి సన్యాసిల్లార అడ్డగోలుగా గా సంపాదించడం లేదు.జనాలను ఎంటర్ టైన్ మెంట్ చేసి.ప్రభాస్ లాగా కండలు పెంచితే , ఎన్టీఆర్ డాన్సులు చేస్తే, డబ్బులు ఇస్తున్నారు. ప్రతి సారి సినిమా వాళ్ళను కెలకొద్దు. దేని నైనా తెగేకొద్ది లాగవద్దు. మేము చేస్తాము అవి చూడండి.. మీరు దృష్టి పెట్టాల్సింది అక్రమ ఆర్జన చేసే రాజకీయ నాయకుల మీద కానీ సినిమా వాళ్ళమీద కాదు. మీరు ముప్పై సంవత్సరాలు రాజకీయాలలో ఉందామని వచ్చారు ఇక్కడకూడా ఎన్ని సంవత్సరాలనుంచీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వున్నారు. ఎవరిని అడగాలో అర్థం కాదు. మీరు పవర్ స్టార్ అంటారు అక్కడ మమ్మలని డొబ్బుతున్నారు. పవన్ కళ్యాణ్ ను చూసి సినిమా ఇండస్ట్రీ నీ తొక్కుతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ పెద్దలకు చెప్పండి..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.. చిత్ర పరిశ్రమ చిన్న దని అనుకుంటున్నారు కానీ దాని ప్రభావం పెద్దది.

మీరు లక్షల కోట్లు సంపాదించి కోవచ్చు మేము సంపాదించ కూడదా??

అయితే మోహన్ బాబు విద్యనికేతన్ లో కూడా ఆన్ లైన్ ఫీజులు పెట్టండి.. రాజ్యాంగ స్ఫూర్తిని నింపుకున్న వాడిని నేను అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాను.. నాకు పిరికి తనం అంటే చిరాకు వైసిపి నాయకులు ఇండస్ట్రీ వైపు చూడొద్దు. ఇది వైసిపి రిపబ్లిక్ అనుకుంటున్నారేమో జాగ్రత్త ఫ్యూచర్ అనేది ఎలా వుంటుంది మీరు చూస్తారు. రాజకీయాలు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు..కానీ నాకర్మ సరిగ్గాలేక నాన్ను నటుడిని రాజకీయ నాయకుడు నీ చేసింది. సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళని చిన్న చూపు చూసే వాళ్ళు సినిమా కష్టం ఏమిటో తెలుసుకోండి.. చిత్ర పరిశ్రమ అంటే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వారుఇక్కడ కుల మతాలకు చోటు లేదు.. చదివేది రామాయణం కుల్చేది గుడులు అంట.. కులతత్వం అనేది నాకు చాలా చిరాకు నేనెప్పుడూ కులం చూసి స్నేహం చేయలేదు.. చిత్ర పరిశ్రమ వాళ్లకు చెపుతున్నాను మీ మీద దాడి చేస్తున్నప్పుడు తిరగ బడండి. థీయేటర్స్ యాజమానులు అందరూ నాని నీ అన్నారు అతని తప్పు ఏముంది మీరు ఏపి గవర్నమెంట్ తో మాట్లాడండి
మీరు పవన్ కళ్యాణ్ సినిమా మీద కోపం వుంటే లక్ష మంది పొట్ట కొడుతున్నారు.

సోదర భావన అని చెపుతున్న మంత్రికి నేను చెప్పేది ఒక్కటే అక్కరకు రాని సోదర భావం దేనికి , వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నీ వైసిపి వాళ్ళు వొదల లేదు. నేను గొడవ పడడానికి సిద్ధమై మాట్లాడుతున్నాను. ఆంధ్రలో 12వందల థియేటర్స్ వుంటే ఒక 10వేల మంది పని చేస్తూ వుంటారు వారి పొట్ట కొడుతుంది వైసిపి ప్రభుత్వం . చిత్ర పరిశ్రమ వాళ్ళు వైసిపి వాళ్లకు చెప్పండి.. నేను లేస్తే మనిషిని కాదు మా వంశం వేరు అని చెప్పే వాళ్ళు కూడా డైర్యంగా బయటకు వచ్చి మాట్లాడండి.

ప్రకాష్ రాజ్ నీ లోకల్ నాన్ లోకల్ అంటే చాలా బాధేసింది. దేశంలో ఎవరు ఇక్కడ నుంచి అయినా పోటీ చెయ్య వద్దు.. వైసిపి వాళ్ళు థియేటర్స్ మూత పడేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు వైసిపి వాళ్లకు చెప్పండి.. మోహన్ బాబు గారికి నైతిక భాధ్యత వుంది.. ఇప్పుడు థియేటర్స్ కు పెట్టిన రూల్స్ రేపు మి విద్య సంస్థల మీద కూడా పెట్టొచ్చు. ఒకసారి విలువ తక్కువ అవుతున్నప్పుడు అది మీ వరకు వస్తుంది. సినిమా పెద్ద లకు విన్నపం.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అందుకే అన్ లైన్ లో టిక్కెట్స్ అమ్ముతాము అంటున్నారు. టిక్కెట్ డబ్బులు గవర్నమెంట్ ఖజానాకు వెళితే అవి బ్యాంక్ లకు గ్యారెంటీ చూపించి లోన్ లు తెచ్చు కుంటారు.. చిరంజీవి గారికి కూడా చెప్పండి ఇది మన హక్కు ..బావ బావ అంటే సరిపోదు కూర్చొని మాట్లాడండి.. తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మేము చెయ్యాల్సింది చేస్తాము.. చిత్ర పరిశ్రమ ను ఆపేస్తే వాళ్ళందరూ ప్రభుత్వం దగ్గరకు వస్తారు అని వైసిపి వాళ్ళు అనుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను ఎవరు అడ్డుకోలేరు…జైహింద్…

error: Content is protected !!