pawan-kalyan

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 27,2022: 2024 ఎన్నికలు చాలా కీలకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆదివారం మంగళగిరిలో పర్యటించిన ఆయన ఇళ్లు కూలిన బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన బాధితులను పిలిపించి రూ.1 లక్ష అందించారు.

ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ..సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో ఏం మాట్లాడారో ఆయనకు ఎలా తెలిసిందని మండి పడ్డారు. వైఎస్సార్‌సీపీతో పోరులో ప్రధాని మోదీ జోక్యాన్ని తాను కోరబోనని, సొంతంగా పోటీ చేస్తానని చెప్పారు. వైఎస్సార్‌సీపీని ఖచ్చితంగా ఓడిస్తామని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇవ్వాలని, అభ్యర్థికి కాకుండా అమలు చేయనున్న విధానాలకు ప్రజలు ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రజలను బెదిరించే వారు ఎవరూ అధికారంలో ఉండరని 2024 ఎన్నికల తర్వాత నీచమైన మాటలు మాట్లాడే వారికి సమాధానం చెబుతామని ఆయన అన్నారు.

pawan-kalyan

మాట్లాడే ముందు ఆలోచించాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలను హెచ్చ రించిన ఆయన.. తనను ఇబ్బంది పెట్టిన వారెవరినీ మర్చిపోనని అన్నారు.

ఇవీ కూడా చదవండి..

”AP04 రామాపురం” సినిమా ట్రైలర్ రిలీజ్

20 రకాల ఇన్ఫ్లుఎంజా వైరస్ నుంచి రక్షించే వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..

భవిష్యత్తులో పాల ధరలను పెంచే ఆలోచన లేదన్న అమూల్

‘ త్వరలో మరో మహమ్మారి.. పరిస్థితులు చాలా ఘోరం ఉండవచ్చు’

ఎన్‌డీటీవీ స్వాధీనంపై గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు

 చైనాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. పలుచోట్ల లాక్ డౌన్..