Sun. Dec 22nd, 2024
Pawan-kalyan-tour

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, వైజాగ్ , అక్టోబర్ 15,2022: ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి: జనసేన పార్టీ భరోసా కార్యక్రమంతో పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేనాని సైనికులు బ్రహ్మరధం పట్టారు.

విమానాశ్రయంలో ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అధినేతను పుష్పగుచ్ఛాలతో సత్కరించగా, వీర మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. భారీ స్థాయిలో విమానాశ్రయానికి జనసైనికులు రాకతో మధ్యాహ్నానికే విమానాశ్రయం ఆవరణ కిక్కిరిసిపోయింది. విమానాశ్రయ లాంజ్ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రావడానికే సుమారు అర గంటకుపైగా సమయంపట్టింది.

Pawan-kalyan-tour

ఉత్తరాంధ్ర కళలకు ప్రతీకగా నిలిచే తప్పెటగుళ్లు, గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలతోపాటు కోలాటం, డప్పు నృత్యాలతో పవన్ కళ్యాణ్ కు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. వేలాది మంది యువకులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెంట సాగారు. రోడ్లకు ఇరువైపులా జనసేన శ్రేణులు, ప్రజలు పూలవర్షం కురిపించారు. ఆడపడుచులు హారతులు పట్టారు. సాగర నగరం జనసేన నినాదాలతో హోరెత్తింది.

Pawan-kalyan-tour

అనంతరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ బస చేయనున్న బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్ కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ గారితోపాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. జనసేనానికి స్వాగతం పలికిన వారిలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, ముత్తా శశిధర్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శులు టి. శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి పాలవలస యశస్వి, చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస యాదవ్, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడుషేక్ రియాజ్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, అధికార ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కరరావు, పార్టీ నేతలు వంపూరి గంగులయ్య, పీవీఎస్ఎన్ రాజు, సందీప్ పంచకర్ల, శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, గడసాల అప్పారావు, డా. బొడ్డేపల్లి రఘు, శ్రీమతి పొలసపల్లి సరోజ తదితరులు జనసేనానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


error: Content is protected !!