365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఎర్రుపాలెం,సెప్టెంబర్ 2, 2025: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఎర్రుపాలెం మండల కేంద్రంలో అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి.

యూత్ పవర్ స్టార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎర్రుపాలెం మాజీ సర్పంచ్ మొగిలి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అప్పారావు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం అక్కడికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రజాసేవలను, నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు.

ఈ వేడుకల్లో యూత్ సభ్యులు సుబ్బారావు, నాగబాబు, సాయి, బాలు, అశోక్, గోపి, ప్రశాంత్, సంతోష్ సహా భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.