Tue. Dec 24th, 2024
Pawanaputra Blood Donors Services to the people of Telugu States

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 3, హైదరాబాద్: పవనపుత్ర యువజన సేవా సంఘం మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్నది. జనసేన అధినేతపవన్ కళ్యాణ్ బర్త్ డే, తోపాటు ఈ సంస్థ వార్షికోత్సవం ఒకేరోజు వచ్చింది. ఈ సందర్భంగా పవనపుత్ర బ్లడ్ డోనర్స్ తరపున హైదరాబాద్ లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానo చేశారు.

Pawanaputra Blood Donors Services to the people of Telugu States
Pawanaputra Blood Donors Services to the people of Telugu States

ఈ కార్యక్రమంలో పవనపుత్ర యువజన సేవా సంఘంప్రెసిడెంట్ రేగటి నవీన్ కుమార్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. నవీన్ మాట్లాడుతూ ప్రజలకు మనవంతు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో పవనపుత్రయువజన సేవా సంఘం, పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ను స్థాపించామన్నారు. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

srikakulam pawana putra blood donors
srikakulam pawana putra blood donors

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ఆమదాలవలస జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర కలిసి నిర్వహించిన రక్తదాన శిబిరంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సంస్థ సేవలను ప్రశంసిస్తూ మెమెంటో అందజేశారు.

error: Content is protected !!