365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 24,2025: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యువతలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన, ‘మంగళవారం’తో ప్రేక్షకుల మనసులు దోచుకున్న నటి పాయల్ రాజ్‌పుత్, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ‘వెంకటలచ్చిమి’ మూవీతో కొత్త ఎంట్రీ ఇస్తోంది.
6 భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఆమె కేరీర్‌ను మరింత మెరుగుపరచే అవకాశాన్ని ఇస్తోంది. రాజా , ఎన్ఎస్ చౌదరి నిర్మాణంలో, డైరెక్టర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ, ‘‘‘వెంకటలచ్చిమి’ అనే చిత్రం కథ రూపొందించినప్పుడు, పాయల్ రాజ్‌పుత్‌ను ప్రధాన పాత్రకు తీసుకోవడం సరైన నిర్ణయంగా అనిపించింది.

ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో రిలీజ్ అవుతుంది. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివెంజ్ నేపథ్యంలో ఉన్న ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించడం ఖాయం’’ అన్నారు.
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఈ ప్రాజెక్ట్‌పై తన స్పందన తెలియజేస్తూ, ‘‘‘మంగళవారం’ సినిమా తర్వాత చాలా స్రిప్ట్‌లు చూశాను. కానీ అన్నింటినీ తిరస్కరించాను. డైరెక్టర్ ముని గారి నుంచి ‘వెంకటలచ్చిమి’ని విన్నప్పుడు చాలా ఆకర్షితులయ్యాను.
ఈ సబ్జెక్టు చాలా బలవంతంగా ఉండటంతో నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్న భావన నచ్చింది. నాకు నమ్మకం ఉన్నది ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నా కెరీర్‌ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లడం’’ అని తెలిపారు.
యూత్ ఆడియెన్స్‌లలో హాట్ ఫేవరేట్‌గా మారిపోయిన పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రం ద్వారా డిఫరెంట్ కాన్సెప్ట్‌లో ఛాలెంజింగ్ పాత్రను ప్రధానంగా పోషిస్తున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముని
మ్యూజిక్ డైరెక్టర్: వికాస్ బడిశా
ప్రొడ్యూసర్‌లు: రాజా, ఎన్ఎస్ చౌదరి
పీఆర్వో: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల